Home /News /sports /

FORMER PAKISTANI FAST BOWLER NADEEM IQBAL SUSPENDED BY PAKISTAN CRICKET BOARD OVER MISCONDUCT CHARGES SJN

Pakistan : ట్రయల్స్ కోసం వచ్చిన మహిళా క్రికెటర్ పై పాక్ మాజీ ప్లేయర్ లైంగిక దాడి.. ఆ తర్వాత స్నేహితులతో..

PC : TWITTER

PC : TWITTER

PCB :  పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ పరువు మళ్లీ పోయింది. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడినందుకు తనకు రావల్సిన డబ్బును ఇవ్వలేదంటూ ఆస్ట్రేలియా (Australia) మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్ నర్ (james faulkner) రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
PCB :  పాకిస్తాన్ (Pakistan) క్రికెట్ పరువు మళ్లీ పోయింది. గతంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడినందుకు తనకు రావల్సిన డబ్బును ఇవ్వలేదంటూ ఆస్ట్రేలియా (Australia) మాజీ ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్క్ నర్ (james faulkner) రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటికి మొన్న తనను మతం పేరుతో వేధించాడని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi)పై అదే దేశానికి చెందిన మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా (Danish Kaneria) ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలను మరువక ముందే పాకిస్తాన్ క్రికెట్ ను లైంగిక ఆరోపణలు కుదిపేశాయి. పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌.. కోచ్‌ నదీమ్‌ ఇక్బాల్‌  (Nadeem iqbal)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. ముల్తాన్‌కు చెందిన ఓ మహిళా క్రికెటర్‌ కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగికంగా ఆమెను వేధించినట్లు వేధింపులకు పాల్పడినట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు(పీసీబీ) ఫిర్యాదు అందింది. దాంతో రంగంలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్‌ చేసి విచారణ చేపట్టింది.

ఇది కూడా చదవండి : ఫినిషర్ గా కార్తీక్ సెట్ అవ్వడా.? అతడి కంటే అక్షర్ బెస్టా.. ఏ లెక్కన చెబుతున్నావ్ బాబూ..

నదీమ్ తప్పు చేశాడని తేలితే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ స్పష్టం చేసింది ప్రస్తుతం నదీమ్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. ’కొన్నేళ్ల క్రితం పాకిస్తాన్ మహిళల జాతీయ జట్టు కోసం నిర్వహించిన ట్రయల్స్ లో పాల్గొన్నాను. అప్పుడే కోచ్ నదీమ్ ఇక్బాల్ పరిచయం అయ్యాడు. పాకిస్తాన్ మహిళా జట్టులో చోటు కల్పిస్తానని నన్ను నమ్మించాడు. ఆ తర్వాత నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోక స్నేహితులతో కలిసి నన్ను శారీరకంగా వేధించాడు. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను వేధించాడు‘ అంటూ బాధిత మహిళా క్రికెటర్ తన ఫిర్యాదులో పేర్కొంది.



50 ఏళ్ల నదీమ్ ఇక్బాల్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 80 మ్యాచ్ లు ఆడి 258 వికెట్లు తీశాడు. 49 లిస్ట్ ఏ మ్యాచ్ లు ఆడిన అతడు 65 వికెట్లు తీశాడు. ఒకానొక సమయంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్ కంటే కూడా నదీమ్ ఇక్బాల్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్ లో అతడు 7 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి టీంను 20 పరుగలకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంత ప్రతిభ ఉన్నా నదీమ్ మాత్రం పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2004లో అతడు తన క్రికెట్ కు గుడ్ బై చెప్పి కోచ్ గా పని చేస్తున్నాడు. అయితే తాజా లైంగిక ఆరోపణలతో నదీమ్ ఊచలు లెక్కబెడుతున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, India vs South Africa, Pakistan, Women harrasment

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు