FORMER PAKISTAN CRICKETER SHOAIB AKHTAR ADVISES VIRAT KOHLI TO GO AHEAD WITHOUT COUNTING THE PRESSURE CRITICISM AND ROUTINE ON STAR PLAYERS SNR
కెప్టెన్సీ వదులుకోవడం కోహ్లీకే మంచిది..ఆ పాక్ క్రికెటర్ ఎందుకలా అన్నాడు
Photo Credit:Twitter
Shoaib Akhtar: టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూనే కొన్ని సూచనలు చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. బాగా ఆడే వాళ్లపై విమర్శలు, ఒత్తిడి ఉంటుందని వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆటను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలన్నారు.
టెస్ట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత కూడా విరాట్ కొహ్లీ నిర్ణయంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు వెల్లడిస్తున్నారు. ఇందులో మాజీ క్రికెటర్ల మొదల్కొని..సెలబ్రిటీల వరకు కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు ఎందుకిలా చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్(Former Pakistan cricketer), ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar)విరాట్ కొహ్లీ (Virat Kohli)రాజీనామా నిర్ణయం వెనుక ఒత్తిడి ఉందన్నారు. ఇండియా క్రికెట్ జట్టు(India cricket team)కు సారధ్యం వహించే విషయంలో ఎదురవుతున్న సమస్యల్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆటపై దృష్టి పెడితే కొహ్లీని మించిన ఆటగాడు మరొకరు లేరంటూ ప్రశంసించారు. క్రికెట్ జట్టుకు సారధ్యం వహించడం అంత సులువైన విషయం కాదని ఎంతో ఒత్తిడి (Pressure),సమస్యలు (Criticism)ఉంటాయన్నారు షోయబ్ అక్తర్. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతను చాలా గొప్ప ఆటగాడ(Great player)ని అక్తర్ కితాబిచ్చారు. ప్రస్తుతం ఉన్న సమస్యల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ ఆడగలిగితే మంచి ఫామ్‌లోకి వస్తాడన్నారు షోయబ్ అక్తర్. టెస్ట్ కెప్టెన్సీకి వదులుకున్న అంశాన్ని గురించి పదే పదే ఆలోచించే కంటే దాన్ని మరిచిపోయి ఆరు నెలల(6Months)పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే కెప్టెన్సీ వదులుకున్ననందుకు ప్రతిఫలం దక్కుతుందని తన అనుభవాన్ని సూచించారు.
కోహ్లీ అద్భుతమైన ఆటగాడు..
విరాట్ కోహ్లీ స్టామినా గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు అక్తర్. మరో 120 సెంచరీలు చేయలను అనే విశ్వాసం కోహ్లీలో కనిపిస్తోందన్నారు. ఇక టీమిండియా టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకునే విషయంలో కొంత మంది వ్యవహారాలు నడిపారంటూ సంచలన ఆరోపణ చేశారు షోయబ్ అక్తర్. అలాంటి కారణాల వల్లే కోహ్లీ సారధ్య బాధ్యతల నుంచి వైదొలగినట్లుగా చెప్పుకొచ్చారు పాకిస్తాన్ ఫార్మర్ క్రికెటర్ షోయబ్ అక్తర్.
#WATCH | Virat Kohli did not relinquish the captaincy himself. He was forced to do so... He is a great cricketer. I think he is going to come out of this: Former Pakistan fast bowler Shoaib Akhtar in Muscat, Oman pic.twitter.com/jbXU5My2bj
బాగా ఆడేవాళ్లపైనే అధిక ఒత్తిడి..
జట్టులో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు కెరియర్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయన్నారు అక్తర్. అలాంటి వాటి గురించి పట్టించుకుంటే ఆటపై ఏకాగ్రత చూపలేరని చెప్పారు. క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తూ అడగలిగితే ఇలాంటి విమర్శలు, సమస్యలను అధిగమించి బాగా రాణించగలరంటూ కోహ్లీకి సూచించారు. భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ ఒక్కరే కాదు..గతంలో సచిన్, గంగూలి, సెహ్వాగ్, ధోనీ లాంటి సమర్ధవంతంగా ఆడిన క్రికెటర్లు కూడా జట్టుకు సారధ్యం వహించిన సమయంలో ఓడిన సందర్భాల్లో విమర్శలు ఎదుర్కొన్న విషయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ గుర్తు చేశారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.