Home /News /sports /

Inzamam-ul-Haq : పాక్ దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ కు గుండెపోటు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Inzamam-ul-Haq : పాక్ దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్ కు గుండెపోటు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Inzamam-ul-Haq (Twitter)

Inzamam-ul-Haq (Twitter)

Inzamam-ul-Haq : పాకిస్తాన్ మాజీ కెప్టెన్, దిగ్గజ పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ (Inzamam ul Haq)కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించి ఆంజియోప్లాస్టి నిర్వహించారు.

    పాకిస్తాన్(Pakistan) మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ ఇంజమామ్‌-ఉల్‌-హక్‌ (Inzamam-ul-Haq)కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని లాహోర్‌లోని ఆస్పత్రికి తరలించి ఆంజియోప్లాస్టి నిర్వహించారు. ఇంజమామ్‌కు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఉన్నట్లు పేర్కొన్నారు. గ‌త మూడు రోజుల నుంచి ఛాతీలో నొప్పి రావ‌డంతో.. ఆయన ఆసుపత్రిలో చేరి టెస్టులు చేయించుకున్నారు. పరిశీలించిన వైద్యులు ఇంజ‌మామ్ గుండెపోటుకు గురైన‌ట్లు తేల్చి అత్యవసరంగా యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఇంజమామ్‌ పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌ గుండెపోటుకు గురయ్యారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు, సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు.‘‘నువ్వు త‍్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

    ఇక 1992 వరల్డ్‌కప్‌ గెలిచిన పాకిస్తాన్‌ జట్టులో సభ్యుడైన ఇంజమామ్‌... దేశంలోని అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. గతంలో పాక్‌ జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన 51 ఏళ్ల ఇంజీ.. ప్రస్తుతం తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా క్రికెట్‌కు సంబంధించిన విశ్లేషణలతో అభిమానులకు టచ్‌లో ఉంటున్నాడు.


    ఇంజమామ్ 1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి.. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా నిలిచాడు. 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థానీ ఆటగాళ్లల్లో మూడో స్థానంలో నిలిచాడు. 119 మ్యాచ్‌ల్లో 8829 పరుగులు చేశాడు.


    2007 లో ఇంజమామ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. పదవీ విరమణ తర్వాత కూడా.. ఆయన పాకిస్తాన్ క్రికెట్‌కు సేవలందించాడు. పలు ముఖ్యమైన పదవులను సైతం నిర్వహించారు. పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇంజమామ్ కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Heart Attack, Pakistan, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు