Chris Cairns: మరింత విషమంగా క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం.. హార్ట్ సర్జరీ చేస్తుంటేనే సడెన్‌ స్ట్రోక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే..

మరింత విషమంగా క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం.. హార్ట్ సర్జరీ చేస్తుంటేనే సడెన్‌ స్ట్రోక్ (PC: Stuff.co.nz)

న్యూజీలాండ్ క్రికెట్ మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్ ఆరోగ్యం చాలా విషమంగా మారింది, గత కొన్నాళ్లుగా వెంటిలేటర్‌పై ఉంటూ వస్తున్న ఆయనకు తాజాగా హార్ట్ సర్జరీ చేస్తుండగా వెన్నెముకలో స్ట్రోక్ వచ్చింది.

  • Share this:
    న్యూజీలాండ్ క్రికెట్ జట్టు (New Zealand Cricket Team) దిగ్గజ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిర్న్స్ (Chris Cairns) ఆరోగ్యం మరింత విషమంగా మారింది. గత కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నాడు. వైద్యులు వెంటనే ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కెయిర్న్స్‌కు చికిత్స అందిస్తున్నారు. ఆర్టోరిక్ డిసెక్షన్ అనే వ్యాధితో బాధపడుతున్న ఆయనకు హర్ట్ సర్జరీ తప్పనిసరి కావడంతో సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ ఆసుసత్రికి తరలించి సర్జరీ ఏర్పాట్లు చేశారు. కాగా, క్రిస్ కెయిర్న్స్‌కు సరజరీ చేస్తున్న సమయంలోనే వెన్నెముకలో స్ట్రోక్ (Stroke) వచ్చినట్లు వైద్యులు చెప్పారు. దీంతో ప్రస్తుతం అతడి కాళ్లకు పక్షవాతం వచ్చి చచ్చుబడిపోయాయని వైద్యులు ధృవీకరించారు. చాలా రేర్ కేసుల్లో మాత్రమే ఇలా హార్ట్ సర్జరీ చేస్తుంటే మరో ప్రాంతంలో స్ట్రోక్ వస్తుందని అన్నారు. ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని చెప్పారు. సర్జరీ ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులు క్రిస్ కెయిర్న్స్‌ను తిరిగి కాన్‌బెర్రాకు తీసుకొని వచ్చారు. సర్జరీ ప్రభావం నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆస్ట్రేలియాలోనే మరొక ప్రముఖ ఆసుపత్రిలో కెయిర్న్స్‌కు కాళ్లకు సంబంధించిన థెరపీ ప్రారంభం కానున్నది.

    'కెయిర్న్స్‌కు సెయింట్ విన్సెంట్ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ చేస్తున్న సమయంలోనే వెన్నెముకలో స్ట్రోక్ వచ్చింది. దీంతో అతడి రెండు కాళ్లకు పక్షవాతం వచ్చింది' అని కెయిర్న్స్ లాయర్ ఆరోన్ లాయిడ్ ఒక పత్రికా ప్రకటనలో చెప్పారు. క్రిస్‌కు సర్జరీ జరుగుతున్న సమయంలో అతని కుటుంబ సభ్యులు అందరూ వెంటే ఉన్నారని ాయన చెప్పారు. కెయిర్న్స్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగానే ఉన్నది.. కానీ నిలకడగానే ఉన్నారని భావించ వచ్చని లాయిడ్ అన్నాడు.

    Olympics 2036: ఒలింపిక్స్‌ 2036కు భారత్ ఆతిథ్యం ఇస్తుందా? ఇందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?



     న్యూజీలాండ్‌లోని పిక్టన్‌లో 1970లో పుట్టిన కెయిర్న్స్ 1989 నుంచి 2006 వరకు ఆ దేశం తరపున క్రికెట్ ఆడాడు. న్యూజీలాండ్ తరపున 62 టెస్టులు, 215 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 3320 పరుగులు, 218 వికెట్లు.. వన్డేల్లో 4950 పరుగులు, 201 వికెట్లు తీశాడు. న్యూజీలాండ్ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో క్రిస్ కెయిర్న్స్ ఒకడు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక బీసీసీఐ రెబల్ లీగ్ ఐసీఎల్‌లో ఆడాడు. కానీ ఆ తర్వాత ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్నాడు. కానీ కెయిర్న్స్ ఈ ఆరోపణలను ఖండించాడు. 2012లో అప్పటి ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు సంబంధించి కేసు వేసి క్రిస్ కెయిర్న్స్ గెలిచాడు. క్రిస్ కెయిర్న్స్ తండ్రి బెర్నార్ట్ లాన్స్ కెయిర్న్స్ కూడా న్యూజీలాండ్ జాతీయ జట్టుకు క్రికెట్ ఆడాడు.

    Published by:John Naveen Kora
    First published: