హోమ్ /వార్తలు /క్రీడలు /

Yuvraj Singh : పోలా..అదిరిపోలా..న్యూ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న యువీ..

Yuvraj Singh : పోలా..అదిరిపోలా..న్యూ స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న యువీ..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Yuvraj Singh : టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు, అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు.

టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడూ తన ఫోటోలు, అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తుంటాడు. లేటెస్ట్ గా తన సరికొత్త లుక్ ను అభిమానులతో పంచుకున్నాడు యువరాజ్ సింగ్. కొత్త గెటప్ లో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు యువీ. దీంతో అభిమానులు ఆ ఫోటోకు పెద్ద ఎత్తున లైక్ లు కొడుతున్నారు. ఈ లుక్ లో సూపర్ గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. యువీ పోస్ట్ పై టీమిండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు స్పందించారు. " భాయ్ పూర్తిగా బాద్ షా లా మారిపోయావ్ " అంటూ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), శిఖర్ ధావన్ (Shikar Dhawan) కామెంట్ చేశారు. ఇక, యువీ లేటెస్ట్ గా జరిగిన వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్ 2021 లో అదరగొట్టాడు. సూపర్ సిక్సులతో పాత యువరాజ్ ను గుర్తు చేశాడు. ఈ 39 ఏళ్ల ప్లేయర్.. ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన పరుగులు చేసి అందరినీ వావ్ అనిపించాడు. కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలో 194 పరుగులు చేసిన యువరాజ్ స్ట్రైక్ రేట్ 170.17గా ఉంది. అయితే, యువీ ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు బాదాడు. ఈ టోర్నమెంట్‌లో ఇవే ఎక్కువ కావడం విశేషం. వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన లీగ్ స్టేజ్ గేమ్‌లో, సిక్సర్ల సింగ్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సిక్సర్లు బాది సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాడు.

ఈ సిరీస్‌లో ఫైనల్ మ్యాచ్‌లోనూ యువరాజ్ రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇదిలాఉంటే.. రోడ్ సేఫ్టీ సిరీస్‌ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన కొన్ని రోజుల తరువాత యువరాజ్ సింగ్ కొత్త లుక్‌తో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. యువీ తన ఫోటోను అలా పోస్ట్ చేశాడో లేదో.. అభిమానులు పెద్ద ఎత్తున లైక్స్ కొట్టారు. కేవలం గంట వ్యవధిలోనే దాదాపు 3 లక్షల లైక్స్ సంపాదించింది ఆ ఫోటో.


2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ సింగ్ గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దాదాపు కొన్ని నెలల పాటు మైదానానికి దూరంగా ఉన్నాడు యువీ. అలాగే, విదేశీ లీగుల్లో ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు యువరాజ్ సింగ్. త్వరలోనే బిగ్ బాష్ లీగ్ లో ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక, యువరాజ్ బాలీవుడ్ (Bollywood) నటి హాజెల్ కీచ్ (Hazle Keech) ను పెళ్లి చేసుకున్నాడు.

First published:

Tags: Yuvraj Singh

ఉత్తమ కథలు