Parthiv Patel: టీమిండియా మాజీ క్రికెటర్ పార్దివ్ పటేల్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్..

పార్దివ్ పటేల్(ఫైల్ పొటో)

టీమిండియా మాజీ క్రికెటర్ పార్దివ్ పటేల్ (Parthiv Patel) నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది.

  • Share this:
    టీమిండియా మాజీ క్రికెటర్ పార్దివ్ పటేల్ (Parthiv Patel) నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. పార్థివ్ పటేల్ తండ్రి అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ (Ajaybhai Bipinchandra Patel) ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ద్వారా పార్దివ్‌ పటేల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘మా నాన్న అజయ్‌భాయ్‌ బిపిన్‌చంద్ర పటేల్‌ మరణించారని తెలుపడానికి చింతిస్తున్నాం. నేడు(సెప్టెంబరు 26) స్వర్గస్తులైనారు. మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’ అని పార్దివ్ పటేల్ పేర్కొన్నారు. ఇక, 2019 నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న బిపిన్ చంద్ర.. ఆదివారం పరిస్థితి విషమించడంతో  తుది శ్వాస విడిచారు. 

    ఈ క్రమంలో.. మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్‌, ప్రజ్ఞాన్‌ ఓజా పార్థివ్‌ కుటుంబానికి సంతాపం తెలియజేశారు. పలువురు అభిమానులు కూడా పార్థివ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.









    చిన్న వయసులో టీమిండియా తరఫున ఆడిన క్రికెటర్లలో పార్థివ్ పటేల్ ఒకరు. వికెట్‌ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా పార్థీవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2020లో పార్థివ్అన్ని పార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక, పార్థివ్ తన కేరీర్‌లో టీమిండియా తరఫున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ విషయానికి వస్తే.. అతడు చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ చార్జర్స్, కొచ్చి టస్కర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫును ఆడాడు.
    Published by:Sumanth Kanukula
    First published: