పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడ్డ సౌరవ్ గంగూలీ...

యూఎన్ వేదికగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల ద్వారా ఇమ్రాన్ గౌరవం తగ్గించుకున్నారని అన్నారు. అంతేకాదు ప్రపంచమంతా శాంతి కోసం ఎదురుచూస్తోంది, ముఖ్యంగా పాకిస్థాన్ లాంటి దేశానికి శాంతి చాలా అవసరం, వీటన్నింటి దృష్ట్యా ఇమ్రాన్ పరిణితి లేని ప్రసంగం విమర్శల పాలైందని సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

news18-telugu
Updated: October 4, 2019, 6:41 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడ్డ సౌరవ్ గంగూలీ...
సౌరవ్ గంగూలీ (Image : Cricketnext)
news18-telugu
Updated: October 4, 2019, 6:41 PM IST
న్యూయార్క్ వేదికగా జరిగిన యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం పూర్తిగా అర్థరహితమైనదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దుయ్యబట్టారు. ఒక క్రికెటర్‌గా ఇమ్రాన్ ఖాన్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుసని, కానీ యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా ఇమ్రాన్ చేసిన ప్రసంగం ద్వారా పూర్తిగా అపఖ్యాతి మూటగట్టుకున్నారని గంగూలీ విమర్శించారు. అంతేకాదు తాను వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగం గురించి విశ్లేషించుకున్నామని, అయితే యూఎన్ వేదికగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యల ద్వారా ఇమ్రాన్ గౌరవం తగ్గించుకున్నారని అన్నారు. అంతేకాదు ప్రపంచమంతా శాంతి కోసం ఎదురుచూస్తోంది, ముఖ్యంగా పాకిస్థాన్ లాంటి దేశానికి శాంతి చాలా అవసరం, వీటన్నింటి దృష్ట్యా ఇమ్రాన్ పరిణితి లేని ప్రసంగం విమర్శల పాలైందని సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దుపై యూఎన్ జనరల్ అసెంబ్లీ వేదికగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

First published: October 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...