మాజీ క్రికెటర్‌పై అల్లరిమూకల దాడి..హాకీ కర్రలతో దారుణంగా కొట్టారు..

భండారిపై జరిగిన దాడిని గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు

news18-telugu
Updated: February 11, 2019, 10:49 PM IST
మాజీ క్రికెటర్‌పై అల్లరిమూకల దాడి..హాకీ కర్రలతో దారుణంగా కొట్టారు..
అమిత్ భండారి (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: February 11, 2019, 10:49 PM IST
ఢిల్లీలో టీమిండియా మాజీ క్రికెటర్ అమిత్ భండారిపై దాడి జరిగింది. ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న భండారిపై కొందరు అల్లరిమూకలు హాకీ కర్రలతో దాడికి పాల్పడ్డారు. సోమవారం సెయింట్ స్టీఫెన్ కాలేజీ గ్రౌండ్‌లో ఈ ఘటన జరిగింది. భండారి తల, చెవి భాగంలో తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భండారి నుంచి వాంగూల్మం తీసుకొని..పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ఢిల్లీ క్రికెటర్ అనూజ్ డేదా, అతని స్నేహితులు కలిసి భండారిపై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అండర్-23 జట్టుకు అనూజ్‌ని ఎంపిక చేయకపోవడంతోనే భండారిపై అటాక్ చేశారు. సీనియర్స్ టీమ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అల్లరిమూకలు గ్రౌండ్‌లోకి వచ్చారు. వస్తూనే...మ్యాచ్ చూస్తున్న అమిత్ భండారిపై కర్రలతో కొట్టారు. మూకుమ్మడిగా దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు. భండారికి గాయాలవడంతో సంత్ పరమానంద్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అతడి తలకు ఆరు కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అనూజ్‌తో పాటు అతడి మిత్రులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్ తరపున రెండు వన్డేలు ఆడాడు అమిత్ భండారి. కాగా, భండారిపై జరిగిన దాడిని గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...