సచిన్ -సెహ్వాగ్‌లో ఫేవరెట్ ఎవరు?..వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ ఇద్దరిలో ఎవరు మేటి ఆటగాడో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సమాధానమిచ్చాడు. తన ఎంపికకు ఆసక్తికరమైన కారణం కూడా చెప్పాడు.

news18-telugu
Updated: July 3, 2020, 10:01 AM IST
సచిన్ -సెహ్వాగ్‌లో ఫేవరెట్ ఎవరు?..వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సచిన్ టెండుల్కర్ (File)
  • Share this:
భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా రాణించలేకపోయాడు.  అయితే దేశీయవాళీ క్రికెట్‌లో మాత్రం తనదైన ముద్రవేశారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపుసాధించాడు. రంజీ క్రికెట్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎవరూ వసీం జాఫర్‌ రికార్డులను విస్మరించలేరు.  మాజీ దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లో ఎవరు మీ ఫేవరెట్ అనే ప్రశ్నకు ముంబైకి చెందిన వసీం జాఫర్ అనూహ్యమైన సమాధానం చెప్పాడు. వారిద్దరిలో తాను సెహ్వాగ్‌నే ఎంచుకుంటానన్నాడు. దీని ఏ ప్రాతిపదికన సెహ్వాగ్ వైపే మొగ్గుచూపుతున్నానో కూడా వెల్లడించాడు. తన ఆటతో వినోదాన్ని పంచే సామర్థ్యం సచిన్ కంటే సెహ్వాగ్‌కు ఎక్కువుందని వ్యాఖ్యానించాడు. కేవలం ఈ ప్రాతిపదికన మాత్రమే తాను సెహ్వాగ్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నాడు.

కాగా వైట్ బాల్ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మల కంటే విరాట్ కోహ్లీ మేటి ఆటగాడని వసీం జాఫర్ కొనియాడారు.  అలాగే తన ఎనిమిదేళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న బౌలర్లలో ఎవరు బెస్టో కూడా చెప్పాడు వసీం జాఫర్. పాక్ మాజీ ఫేసర్ షాయిబ్ అక్తర్ కంటే ఆసీస్ మాజీ ఫేసర్ బ్రెట్లీ కష్టమైన బౌలర్‌గా వ్యాఖ్యానించాడు. బెట్లీ బౌలింగ్ అత్యంత కచ్చితత్వంతో ఉంటుందని పేర్కొన్నాడు.

కరోనా కాలంలోనూ ఆటగాళ్లు ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వసీం జాఫర్ సూచించాడు. ఏదీ శాశ్వితం కాదన్న జాఫర్...కరోనా సంక్షోభం కూడా త్వరలోనే పోతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
First published: July 3, 2020, 10:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading