భారత క్రికెట్ దిగ్గజం అజిత్ వాడేకర్ స్మృతిలో...

భారత దిగ్గజం అజిత్ వాడేకర్‌‌కు క్రికెట్ ప్రపంచమంతా నివాళులర్పిస్తోంది.ఇండియన్ క్రికెట్‌కు ఎన్నో దశల్లో,ఎన్నో విధాలుగా సేవలందించిన అజిత్ వాడేకర్ భారత క్రీడా దిగ్గజాలు స్మరించుకుంటున్నారు.

news18-telugu
Updated: August 16, 2018, 2:17 PM IST
భారత క్రికెట్ దిగ్గజం అజిత్ వాడేకర్ స్మృతిలో...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్(ఫైల్ ఫోటో)
  • Share this:
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కన్నుమూశారు. భారత జట్టుకు ఆయన కోచ్‌గానూ సేవలు అందించారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. భారత జట్టు తరఫున ఆయన 37 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 1941లో ముంబైలో జన్మించిన ఆయన...భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరుగా పేరుగాంచారు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన అజిత్ వాడేకర్...నెం.3 స్థానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేవారు.

1974లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టుకు వాడేకర్ సారథ్యంవహించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 1990లలో జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా సేవలందించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, సురేష్ ప్రభుతో పాటు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖలు ప్రగాఢ సంతాపం తెలిపారు.

First published: August 15, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు