• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • FORMER ENGLAND CRICKETER DAVID LLOYD HAS COME OUT ATTACKING INDIAN SKIPPER VIRAT KOHLI FOR HIS STAND ON UMPIRES CALL SRD

Virat Kohli : విరాట్ ప్రవర్తన అసలు బాలేదు..కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

Virat Kohli : విరాట్ ప్రవర్తన అసలు బాలేదు..కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

Photo Credit : Twitter

Virat Kohli :టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరోసారి టార్గెట్ చేశారు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు. ఈ సారి గ్రేట్ డేవిడ్ లాయిడ్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు.

  • Share this:
    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మరోసారి టార్గెట్ చేశారు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు. ఈ సారి గ్రేట్ డేవిడ్ లాయిడ్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు. మైదానంలో కోహ్లీ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ దుయ్యబట్టాడు. విరాట్ కోహ్లీ ప్రవర్తన ఏ మాత్రం బాలేదని, అంపైర్లకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డాడు. అనేక సార్లు కోహ్లీ, అంపైర్లను అగౌరవపరిచాడని ఆరోపించాడు. టీ20 సిరీస్‌‌లో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ అవుట్‌కు కారణమైన డేవిడ్ మలాన్ వివాదాస్పద క్యాచ్‌పై విరాట్ కోహ్లీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాచ్ సరైంది కాదని, "సాఫ్ట్ సిగ్నల్" ఇవ్వాల్సిందిగా అంపైర్లకు కోహ్లీ సూచించాడు. ఈ క్రమంలోనే అంపైర్.. ఓవైపు సూర్యకుమార్‌ను అవుట్‌గా పరిగణిస్తూనే మరోవైపు థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ అంపైర్‌కు చేసిన సూచన మొదలు.. ఇప్పటి వరకు అతను చేసిన కామెంట్స్‌ని ఉటంకిస్తూ లాయిడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. "అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ నితిన్ మీనన్‌పై ఇంగ్లాండ్ టీమ్ ఒత్తిడి తెచ్చిందో లేదో నాకు తెలియదు కానీ.. ఒక విషయం మాత్రం తెలుసు. ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ అంపైర్లపై ఒత్తిడి చేయడాన్ని క్షుణ్ణంగా గమనించాను. అంపైర్లపై ఒత్తిడి చేయడం, వారిని అగౌరవపరచడం, వారి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రివ్యూలు కోరడాన్ని స్పష్టంగా గమనించాను’ అని లాయిడ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.

    అలాగే.. "భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో అంపైర్‌ కాల్‌ను డెసిషన్‌ రివ్యూ సిస్టమ్ నుంచి తొలగించాలని విరాట్ కోరాడు. అలాగే బంతి స్టంప్స్ ఏ భాగం తాకినా ఔట్‌గా పరిగణించాలని డిమాండ్ చేశాడు. ఇది అసలు సరైన పద్ధతే కాదు." అని లాయిడ్ పేర్కొన్నాడు. "పరిస్థితులను గమనిస్తే.. విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో జరిగే పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. కోహ్లీ చెప్పినట్లు బంతి కేవలం బెయిల్స్‌కి తగలడం మొదలు ప్రతీది ఔట్‌గానే పరిగణిస్తే.. ఇక అన్ని టెస్ట్ మ్యాచ్‌లు రెండు రోజుల్లో ముగుస్తాయి. అలాగే వన్డే మ్యాచ్‌లు నాలుగు గంటల్లోనే కంప్లీట్ అవుతాయి" అని లాయిడ్ వ్యాఖ్యానించాడు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ తన మాటల్లో, చేతల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం అని లాయిడ్ హితవు చెప్పాడు.

    David Lloyd


    నాలుగో టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ ఆడిన షాట్‌ను మలాన్ క్యాచ్‌ పట్టాడు. అయితే ఆ బంతి పిచ్‌న్ తాకినట్లుగా కనిపించింది. టీవీల ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికీ అది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, అంపైర్‌కు మాత్రం నాటౌట్ అనిపించలేదు. ఔట్‌గానే పరిగణించాడు. అయితే, క్యాచ్‌పై అనుమానంతో.. ఓవైపు థర్డ్ అంపైర్‌ను కోరుతూనే.. మరోవైపు తన నిర్ణయాన్ని ‘అవుట్’గా ప్రకటించాడు. ఏకకాలంలో ఇలా చేయడాన్నే ‘సాఫ్ట్ సిగ్నల్’ అంటారు. అయితే, థర్డ్ అంపైర్ వరుసగా రీప్లేలు చూసినా.. స్పష్టత లేకపోవడంతో ఫీల్ట్ అంపైర్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. ఇప్పటికే అంపైర్ కాల్ పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయ్. ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు చాలా మంది తప్పుబడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు