FORMER ENGLAND CAPTAIN MICHAEL VAUGHAN SHARED A FUNNY POST AND DIG AT THE NATURE OF THE PITCH AHEAD OF THE 4TH TEST SRD
India vs England : మొతేరా పిచ్‌పై ఆగని మైకేల్ వాన్ ఏడుపు..మరోసారి సెటైరికల్ పోస్ట్...
మైకేల్ వాన్ (Photo Credit : Instagram)
India vs England : పిచ్ పై నిందలు ఆపి బ్యాటింగ్ పై దృష్టి సారించాలని క్రికెట్ దిగ్గజాలు సూచించినా..పేస్ పిచ్ లపై బ్యాట్స్ మెన్ విఫలమైనప్పుడు లేవని నోళ్లు కొంచెం స్పిన్ అయితే ఏడ్చి చస్తున్నారని స్టార్ స్పిన్నర్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నా..ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాత్రం తన విమర్శలను ఆపడం లేదు.
మొతేరాలో టీమిండియా విజయంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నాడు. అది టెస్ట్ మ్యాచ్ నిర్వహించే పిచ్ కాదని.. అసలే మూడు టెస్ట్‌లో విజయం ఎవరిది కాదన్నాడు. భారత్ ఎలాంటి విధానాన్ని అవలభించిన ఐసీసీ మాత్రం అభ్యంతరం చెప్పడం లేదని విమర్శించాడు. మరోవైపు, పిచ్ పై నిందలు ఆపి బ్యాటింగ్ పై దృష్టి సారించాలని క్రికెట్ దిగ్గజాలు సూచించినా..పేస్ పిచ్ లపై బ్యాట్స్ మెన్ విఫలమైనప్పుడు లేవని నోళ్లు కొంచెం స్పిన్ అయితే ఏడ్చి చస్తున్నారని స్టార్ స్పిన్నర్లంతా అసహనం వ్యక్తం చేస్తున్నా..ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ మాత్రం తన విమర్శలను ఆపడం లేదు. అసలు ఆ పిచ్ టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని ఘాటుగా విమర్శించిన వాన్.. ఇలాంటి పిచ్‌లను తయారు చేస్తే మూడు ఇన్నింగ్స్‌లు ఆడేలా నిబంధనలు తీసుకురావాలని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతటితో ఆగకుండా ఇదే మైదానం వేదికగా గురువారం నుంచి జరగనున్న నాలుగో టెస్టుకు ఇలాంటి పిచ్‌నే తయారు చేస్తున్నారని, పొలం దున్నినట్లు పిచ్‌ను నాగలితో దున్నుతున్నారని సెటైర్లు పేల్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా రైతు పొలం దున్నుతున్న ఫొటోను పంచుకున్నాడు.
లేటెస్ట్ గా మరో అడుగు ముందుకేసిన వాన్ .. ఆ పిచ్‌పై తన ప్రిపరేషన్ ఎలా ఉందో చూడండి అంటూ మరో సెటైరికల్ ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఆ ఫొటోలో ఈ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ దున్నిన పొలంలో బ్యాటింగ్ చేస్తున్నట్లుగా ఫోజిచ్చాడు. ''నాలుగో టెస్టుకు నా ప్రిపరేషన్ సూపర్‌గా జరుగుతుంది'' అంటూ దానికి క్యాప్షన్ జత చేశాడు. వాన్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Mr. VAUGHAN You can tease upto the point people get irritated by your comments. We know england not worthy enugh to win WC 2019, and apart from andreson or stokes there is no one player to be in test championship squad.. So dont waste your time.. @ashwinravi99@ivivianrichards
"సిరీస్‌ను3-1తో భారత్ కైవసం చేసుకోవడం ఖాయం.. నాలుగో టెస్టు.. పింక్ బాల్ టెస్టు కన్నా దారుణంగా ఉండబోతుంది.. మీ పోస్టులు నవ్వు తెప్పిస్తున్నా.. పిచ్ కండీషన్ మాత్రం భయకరంగా ఉంది" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అహ్మదాబాద్ పిచ్‌పై వాన్తో పాటు యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, మార్క్ వా, హర్భజన్ సింగ్ లాంటి మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు చేశారు. ఈ విమర్శలపై అశ్విన్, నాథన్ లయన్, ప్రజ్ఞాన్ ఓజా, వీవీ రిచర్డ్స్ కౌంటరిచ్చారు. ఇక రేపట్నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విక్టరీ కొడితే..డైరెక్ట్ గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగుపెడుతోంది.