• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • FORMER CRICKETERS FIRE ON ICC WTC FINAL IS NOT CONDUCTING IN PROPER WAY JNK

WTC Final : ఇంకో సారి యూకేలో ముఖ్యమైన మ్యాచ్‌లు వద్దు.. ఇవేం నిబంధనలు.. ఐసీసీపై మాజీ క్రికెటర్ల ఫైర్

డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణ తీరు, నిబంధనలపై ఆగ్రహం (ICC)

టెస్టు క్రికెట్‌లో విశ్వవిజేతను నిర్ణయించే కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షాకాలంలో పెట్టడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఐసీసీకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని వారు అంటున్నారు.

  • Share this:
    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final) నిర్వహణ తీరుపై ఐసీసీని (ICC) అభిమానుల నుంచి దిగ్గజ క్రికెటర్ల వరకు విమర్శిస్తున్నారు. ఇంగ్లాండ్‌లో ఈ సమయంలో వర్షాలు పడుతాయని తెలిసి ముందు జాగ్రత్త లేకుండా షెడ్యూల్ నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్‌లో విశ్వ విజేతను నిర్ణయించడానికి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఇరు జట్ల ఆటగాళ్లకే కాకుండా అభిమానులకు కూడా తీవ్ర నిరాశను మిగిల్చింది. నాలుగు రోజుల్లో కేవలం రెండు రోజుల ఆట మాత్రమే సాధ్యపడింది. 2, 3వ రోజుల్లో ఆట జరిగినా అన్ని సెషన్లు పూర్తి స్థాయిలో నిర్వహణ సాధ్యం కాలేదు. వర్షానికి తోడు వెలుతురు లేమి కూడా ఇబ్బంది పెట్టింది. ఆటలో మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. రిజర్వ్ డేతో కూడా కలిపి రెండు రోజులు ఆట ఆడే అవకాశం ఉన్నది. అయితే ఈ రెండు రోజుల్లో అందుబాటులో ఉండే 6 సెషన్లలో వర్షం, వెలుతురు సమస్యల కారణంగా ఎలాంటి సమస్యలు తలెత్తకపోతే 190 ఓవర్ల పాటు ఆట ఆడే అవకాశం ఉంది. ఆ ఓవర్లలోనే మ్యాచ్ ఫలితం తేలాల్సి ఉన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనే సందిగ్దత నెలకొన్నది.

    ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహణపై అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. వర్షాకాలంలో ఎలా పెడతారంటూ సోషల్ మీడియా సాక్షిగా ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ ఐసీసీపై తమ కసిని తీర్చుకుంటున్నారు. ఇక మాజీ క్రికెటర్లు కూడా ఐసీసీ నిబంధనలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ జరుగుతున్న తీరు తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని.. ఐసీసీ నిబంధనలు సరిగా లేవని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. తప్పకుండా విజేతను నిర్ణయించాల్సిన మ్యాచ్ ఇలా ఆటంకాలతో కొనసాగుతుండటం నిరుత్సాహపరుస్తున్నది అని అన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ అనడంపై సునిల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్ం చేశారు. ఇలాంటి మ్యాచ్‌లో ఎవరో ఒక విజేతను తప్పకుండా ప్రకటించాలి. అందుకోసం కొత్త మార్గాన్ని అన్వేషించాలి. సంయుక్తం విజేతను ప్రకటిస్తాననడం సమంజసం కాదని అన్నాడు.

    Euro 2020 : ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు 'పిచ్ ఇన్‌వాడర్స్' ఆటంకం.. ఆ తర్వాత వారికి ఏం శిక్ష వేస్తారో తెలుసా?

    ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సెన్ అయితే ఇకపై యూకేలో ముఖ్యమైన ఐసీసీ మ్యాచ్‌లు నిర్వహించవద్దని కోరాడు. ఇది చాలా బాధ కలిగించే విషయమే అయినా.. యూకేను ఒకపై ఇలాంటి వాటికి వేదికగా ఎంపిక చేయవద్దని ఆయన ట్వీట్ చేశాడు. మరి ఇక మిగిలిన ఆరు సెషన్లు అయినా జరుగుతాయని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
    Published by:John Naveen Kora
    First published: