Home /News /sports /

FORMER CRICKETERS DEBATE OVER AUSTRALIAS WOES

ప్రభ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు...జీర్ణించుకోలేకపోతున్న మాజీలు

ఆస్ట్రేలియాకి పూర్వ వైభవం దక్కేనా?

ఆస్ట్రేలియాకి పూర్వ వైభవం దక్కేనా?

ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు తొలి టెస్ట్ సిరీస్ విజయం సాధించడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభ కోల్పోతున్న ఆస్ట్రేలియా జట్టుకు చేయాల్సిన కాయకల్ప చికిత్స గురించి చర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
    2018 సంవత్సరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఓ పీడకలగా మాగిలిపోనుంది. భారత్, పాక్, దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓడిపోయి ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. సొంత గడ్డపై టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ సిరీస్ కోల్పోవడాన్ని అక్కడి క్రికెట్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో ప్రపంచ మేటి జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు దాపురింది? జట్టులో లోపాలు ఏంటి? లోపాలు, బలహీనతలను ఎలా సరిదిద్దుకోవాలి? పూర్వ వైభవం సాధించడం ఎలా? ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఇదే చర్చించుకుంటున్నారు.

    గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా జట్టు ప్రభ కోల్పోవడానికి కారణాలను మాజీ క్రికెటర్లు విశ్లేషించుకుంటున్నారు. జట్టులోని కీలకమైన ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకోవడంతో పాటు బాల్ ట్యాంపరింగ్ స్కాం కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ నిషేధానికి గురికావడం జట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగించినట్లు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు కొందరు విశ్లేషిస్తున్నారు.


    టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంతో ఆసీస్ మాజీ క్రికెటర్లు మార్క్ వా, మైఖేల్ వాగన్‌లు ట్విట్టర్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగానే చర్చించుకున్నారు. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత దుస్థితికి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై నిషేధమే కారణమని మీరు భావిస్తే, అది పొరబాటు అవుతుందంటూ ఫాక్స్ క్రికెట్‌కు మైఖేల్ వాగన్ ఓ కథనాన్ని రాశారు. దీనిపై స్పందించిన మార్క్ వా...ఇద్దరు కీలక ఆడగాళ్లు ఏదైనా కారణంతో జట్టుకు దూరమైతే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. డేవిడ్ వార్నర్, స్మిత్ చేరికతో జట్టు బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.





    అటు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ కూడా ఈ చర్చపై స్పందించారు. ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ ఒక్కటే సమస్యకాదని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా జట్టును గాడిలో పెట్టాలంటే చేపట్టాల్సిన చర్యలను తన ట్వీట్‌లో వివరించారు.

    First published:

    Tags: Cricket

    తదుపరి వార్తలు