వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో స్కోర్లు సమం అయినప్పుడు, ఇన్నింగ్స్ లో బౌండరీల కౌంట్ ఆధారంగా విజేతను ఎంపిక చేయడంపై యువీ తన నిరసన వ్యక్తం చేశాడు. ఐసీసీ బౌండ్రీ రూల్ పై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో, యువరాజ్ ట్విట్టర్ వేదికగా ఐసీసీ రూల్స్ పై నిరసన తెలిపాడు. రూల్స్ ను తాను అంగీకరించడం లేదని, అయినప్పటికీ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవడం పై శుభాకాంక్షలు తెలుపుతూనే, తన హృదయం మాత్రం కివీస్ వెంటే ఉందని యూవీ అన్నాడు. చివరి వరకూ కివీస్ చూపిన పోరాట పటిమ తనను కలచివేసందని యువీ పేర్కొన్నాడు. అలాగే యూవీతో పాటు ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ సైతం ఐసీసీ రూల్స్ పై నిరసన వ్యక్తం చేశాడు.
I don’t agree with that rule ! But rules are rules congratulations to England on finally winning the World Cup , my heart goes out for the kiwis they fought till the end 😥. Great game an epic final !!!! #CWC19Final
— yuvraj singh (@YUVSTRONG12) July 14, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.