FORMER CRICKETER RAHUL DRAVID WILL SUCCEED RAVI SHASTRI AS HEAD COACH OF TEAM INDIA SRD
Rahul Dravid : టీమిండియా నెక్ట్స్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఫిక్స్.. బీసీసీఐ అధికారిక ప్రకటన..
Rahul Dravid (Twitter)
Rahul Dravid : రవిశాస్త్రి టీమిండియాకు అందించిన సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. అయితే, రవిశాస్త్రి హయాంలో టీమిండియా టెస్ట్ నంబర్ జట్టుగా, డబ్ల్యూటిసీ ఫైనలిస్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
అనుకున్నదే జరిగింది. ఎటువంటి సస్పెన్స్ లేకుండా టీమిండియా హెడ్ కోచ్ (Team India Head Coach) ను ప్రకటించింది బీసీసీఐ. టీమిండియా హెడ్ కోచ్‌గా భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) ఎంపికైనట్లు బీసీసీఐ (BCCI) బుధవారం అధికారికంగా ప్రకటించింది. స్వదేశంలో నవంబర్ 17న ప్రారంభంకానున్న న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రావిడ్ బాధ్యతలు చేపడతాడని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఎన్సీఏ హెడ్ పదవికి రాజీనామా సమర్పించిన రాహుల్ ద్రావిడ్, టీమిండియా హెడ్‌కోచ్ పదవికి వారం రోజుల క్రితమే అధికారికంగా దరఖాస్తు సమర్పించాడు. అక్టోబర్ 26న రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు ముగిసింది. అయితే టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి, ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. రవిశాస్త్రి టీమిండియాకు అందించిన సేవలకు గాను బీసీసీఐ కృతజ్ఞతలు తెలిపింది. అయితే, రవిశాస్త్రి హయాంలో టీమిండియా టెస్ట్ నంబర్ జట్టుగా, డబ్ల్యూటిసీ ఫైనలిస్ట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియా ఓటమి తర్వాత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రవిశాస్త్రి, టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాక్ చేతుల్లో భారత జట్టు ఓటమి తర్వాత ఆ పదవి నుంచి తప్పుకోబోతుండడం విశేషం. ఇంతకుముందెన్నడూ లేని విధంగా రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో టెస్టుల్లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు, ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీపై పాక్‌పై ఉన్న అన్‌బీటెన్ రికార్డును కూడా కోల్పోవాల్సి వచ్చింది.
🚨 NEWS 🚨: Mr Rahul Dravid appointed as Head Coach - Team India (Senior Men)
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవీకాలం కూడా ముగియనుంది. రాహుల్ ద్రావిడ్ సన్నిహితుడు, ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అసోసియేషన్)లో బౌలింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన పరాస్ మాంబ్రే, బౌలింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. అలాగే ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
ఫీల్డింగ్ కోచ్ పదవికి భారత మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ బ్యాటర్ అజయ్ రత్రా దరఖాస్తు సమర్పించాడు. హర్యానాకి చెందిన అజయ్ రత్రా, టీమిండియా తరుపున 6 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. అయితే, హెడ్ కోచ్ నియామకం గురించి క్లారిటీ వచ్చినా, మిగిలిన పొజిషన్లకి గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు బీసీసీఐ. ఈ పోస్ట్ లపై కూడా త్వరలోనే క్లారీటి వచ్చే అవకాశం ఉంది. అయితే, రాహుల్ ద్రావిడ్ ఎంపిక విషయంలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సంప్రదించకుండానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.