మద్యం మత్తులో రచ్చ చేసిన టీమిండియా క్రికెటర్‌..

ప్రవీణ్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు స్వీకరించలేదని పేర్కొన్నాడు. క్రికెటర్‌గా అతనికి ఉన్న హోదా వల్లే తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించాడు.

news18-telugu
Updated: December 15, 2019, 6:02 PM IST
మద్యం మత్తులో రచ్చ చేసిన టీమిండియా క్రికెటర్‌..
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్
  • Share this:
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ వివాదంతో వార్తల్లో నిలిచాడు. తనపై,తన కొడుకుపై ప్రవీణ్ కుమార్ దాడి చేశాడని ఆరోపిస్తూ దీపక్ శర్మ అనే అతని పొరుగింటి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ మద్యం మత్తులో ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో తన కొడుకు స్కూల్ బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో.. ప్రవీణ్ కారులో అక్కడికి వచ్చినట్టు చెప్పాడు. కారు దిగడమే ఆలస్యం బస్సు డ్రైవర్‌పై దుర్భాషలాడిన ప్రవీణ్.. ఆపై తనను కూడా తీవ్రంగా దూషించాడని తెలిపాడు. ప్రవీణ్ దూషణకు అడ్డు చెప్పినందుకు.. తనపై దాడి చేశాడని,అతని దాడిలో చెయ్యి ఫ్రాక్చర్ అయిందని పేర్కొన్నాడు. అంతేకాదు,తన ఏడేళ్ల కొడుకును కూడా విసిరేయడంతో అతనికి కూడా గాయాలైనట్టు చెప్పాడు.

ప్రవీణ్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారు స్వీకరించలేదని పేర్కొన్నాడు. క్రికెటర్‌గా అతనికి ఉన్న హోదా వల్లే
తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించాడు. పైగా ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే చచ్చిపోతావంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని వాపోయాడు. మరోవైపు స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. వారిద్దరూ తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇరుగుపొరుగు అయిన వారిద్దరి మధ్య

గొడవ ఎందుకు జరిగిందో దర్యాప్తు చేస్తున్నామన్నారు.కాగా,ప్రవీణ్ కుమార్ వివాదాల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. 2008లో మీరట్‌లో ఓ డాక్టర్‌పై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>