Home /News /sports /

FORMER CRICKETER ANIL KUMBLE NOT INTRESTED FOR TEAM INDIA HEAD COACH AND BCCI IS NOW IN SEARCH FOR FORIEGN COACH SRD

Team India Head Coach : టీమిండియా కోచ్ పదవికి నో చెప్పిన అనిల్ కుంబ్లే..! అసలు కారణం ఆ స్టార్ ప్లేయరే..!

అనిల్ కుంబ్లే(ఫైల్ ఫొటో) (Getty Images)

అనిల్ కుంబ్లే(ఫైల్ ఫొటో) (Getty Images)

Team India Head Coach : త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ (T20 World Cup-2021) తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కోచ్ గా కొనసాగేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పూర్తి క్లారిటీతో ఉన్న రవిశాస్త్రి తన నిర్ణయాన్ని బీసీసీఐ (BCCI) పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి నిర్ణయంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది.

ఇంకా చదవండి ...
    టీమిండియాకు (Team India) త్వరలో కొత్త కోచ్ (New Coach for Team India) రానున్నారు. అదేంటి ప్రస్తుతం కోచ్ పదవిలో రవిశాస్త్రి (Coach Ravi Shastri) ఉన్నారుగా అనుకుంటున్నారు. త్వరలోనే రవిశాస్త్రి తన పదవికి గుడ్ బై చెప్పనున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ (T20 World Cup-2021) తర్వాత రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆ తర్వాత కోచ్ గా కొనసాగేందుకు ఆయన విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పూర్తి క్లారిటీతో ఉన్న రవిశాస్త్రి తన నిర్ణయాన్ని బీసీసీఐ (BCCI) పెద్దలతో చెప్పినట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి నిర్ణయంతో బీసీసీఐ కొత్త కోచ్ వేటలో పడింది. అయితే, కోచ్ పదవి కోసం బీసీసీఐ చేస్తోన్న ప్రయత్నాలు కొలిక్కి రావట్లేదు. కోచ్ రేస్ లో టీమిండియా లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లె (Anil Kumble) పేరు ఇదివరకే వినిపించింది.

    టీమిండియా మాజీ సొగసరి బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కూడా కోచ్ పదవి కోసం రేసులో ఉన్నారనే వార్తలొచ్చాయి. ఇప్పుడు అవేవీ వాస్తవ రూపాన్ని దాల్చలేకపోవచ్చు. టీమిండియా కోచ్‌గా పునరాగమనం చేయడానికి అనిల్ కుంబ్లే అనాసక్తిగా ఉన్నట్లు సమాచారం. మళ్లీ కోచ్‌గా వెళ్లడానికి ఏ మాత్రం ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఇదివరకే కుంబ్లే ఏడాదికాలం పాటు కోచ్‌గా పని చేశాడు. 2016 నుంచి 2017 మధ్యకాలంలో టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేశాడతను. అప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli Latest News) యాటిట్యూడ్ వల్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్న కుంబ్లే.. మరోసారి అతని వల్లే ఈ పదవికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    వీవీఎస్ లక్ష్మణ్ (ఫైల్ ఫోటో)


    కుంబ్లే వైదొలగిన తరువాతే రవిశాస్త్రి రెండోసారి కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. ఆయన పదవీ కాలం ముగియబోతోంది. రవిశాస్త్రి కాల పరిమితి ముగిసిన తరువాత మళ్లీ అనిల్ కుంబ్లే రీ ఎంట్రీ ఇస్తాడనే వార్తలొచ్చాయి. దాదాపుగా కుంబ్లే జట్టు కోచ్‌గా నియమితుడు కావడం లాంఛనప్రాయమేననే అంచనాలు వ్యక్తం అయ్యాయి. అవన్నీ తలకిందులు కానున్నాయి.

    కోచ్ పదవి కోసం అనిల్ కుంబ్లే పెద్దగా ఆసక్తి చూపట్లేదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి. 2017లో ఎలాంటి పరిస్థితుల్లో తాను కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందో.. అవే పరిస్థితులు ఇంకా జట్టులో ఉన్నాయని కుంబ్లే భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీవీఎస్ లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నప్పటికీ.. బీసీసీఐ ఆయన పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదని అంటున్నారు. దీనితో విదేశీ కోచ్ కోసం అన్వేషిస్తోన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఇది కూడా చదవండి : కుర్రాళ్ల క్రష్ సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తి ఎన్ని కోట్ల తెలిస్తే మైండ్ బ్లాకే..!

    విదేశీ కోచ్ ల రేస్ లో కొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనె, ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో రికీ పాంటింగ్ ఢిల్లీ కేపిటల్స్‌కు పని చేస్తోన్నాడు. అతని హయాంలో ఆ జట్టు వరుస విజయాలను అందుకుంటోంది. ఇక, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Anil Kumble, Bcci, Cricket, Ravi Shastri, Sourav Ganguly, Team india, Virat kohli, VVS Laxman

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు