• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • FORMER CHIEF SELECTOR KIRAN MORE REVEALS IN WHICH CIRCUMSTANCES MS DHONI WAS PICKED IN THE INDIAN TEAM SRD

MS DHONI : అందుకే మిస్టర్ కూల్ ధోనీని జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది : భారత మాజీ సెలక్టర్

Dhoni (ఫైల్ ఫోటో)

MS DHONI : ధోనీ లాంటి ప్రతిభావంతమైన ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకున్నామనే విషయాన్ని నాటి భారత చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ధోనీని జట్టులోకి తీసుకు రావాల్సి వచ్చిందో వివరించాడు.

  • Share this:
    మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ ముఖ చిత్రం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. 28 ఏళ్ల నీరిక్షణకు తెరదించుతూ వన్డే ప్రపంచకప్ తెచ్చిన మహీ.. టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీతో ఐసీసీ ట్రోఫీలన్నీటిని అందించాడు. టెస్ట్‌ల్లో జట్టును టాప్ ప్లేస్ లో నిలిపాడు. తనదైన సారథ్యంతో భారత క్రికెట్ గతినే మార్చేశాడు. అయితే ఇంతటి ప్రతిభావంతమైన ఆటగాడిని జట్టులోకి ఎలా తీసుకున్నామనే విషయాన్ని నాటి భారత చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ధోనీని జట్టులోకి తీసుకు రావాల్సి వచ్చిందో వివరించాడు.

    2004లో భారత జట్టు స్పెషలైజ్‌డ్ వికెట్ కీపర్ లేని సమస్యను ఎదుర్కొందని, రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్‌గా రాణిస్తున్నా.. అది అతనికి అదనపు భారమైందని, అప్పుడే తాము ధోనీని జట్టులోకి తీసుకొచ్చామని కిరణ్ మోరే గుర్తు చేసుకున్నాడు. అయితే ధోనీకి బదులుగా మా ముందు దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్ ఉన్నా.. భారీ హిట్టింగ్ చేయగల బ్యాట్స్‌మన్ కమ్ వికెట్ కీపర్ కోసం తాము అన్వేశించామన్నాడు. ఆ పరిస్థితుల్లో తమకు ధోనీ సరైనవాడిగా అనిపించాడని తెలిపాడు.

    kiran more
    kiran more (image credit : twitter)


    ‘రాహుల్ ద్రవిడ్ అప్పటికే 75 వన్డేలు కీపింగ్ చేశాడు. దాంతో మేం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కోసం అన్వేశించాం. బంతిని బలంగా బాదే బ్యాట్స్‌మన్‌ను తీసుకొచ్చి రాహుల్‌పై భారాన్ని తగ్గించాలనుకున్నాం. ఆ పరిస్థితుల్లో మాకు ధోనీనే కంప్లీట్ ప్యాకెజ్‌లా కనిపించాడు. అతని గేమ్ అప్రోచ్ కూడా చాలా ప్రత్యేకంగా అనిపించింది. దాంతో ఇండియా ఏ తరఫున ఎంపిక చేసి కెన్యా పర్యటనకు పంపించాం. అక్కడ మహీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 600కు పైగా పరుగులు చేశాడు. మాకు అప్పటికే సెహ్వాగ్, యువరాజ్ వంటి భారీ హిట్టర్లున్నారు. కానీ ధోనీ రాకతో భారత్ టీమ్ సమతూకంగా అనిపించింది.'అని కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.

    Dhoni
    Dhoni


    మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. అతని గురించి చర్చలు మాత్రం సాగుతూనే ఉన్నాయి. నిత్యం ధోనీ పేరు వార్తల్లో ఉంటుంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లోనూ ప్రత్యర్థి వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సైతం మహీ మెరుపు వికెట్‌ కీపింగ్ నైపుణ్యాలను గుర్తు చేసుకున్నాడు. రెండో టీ20లోనూ ధోనీని ఎంతో మిస్‌ అవుతున్నామని భారత అభిమానులు ప్లకార్డులను ప్రదర్శించగా.. బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులతో తాను కూడా మిస్‌ అవుతున్నాని తెలియజేసేలా సైగలు చేశాడు.
    Published by:Sridhar Reddy
    First published: