• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • FORMER AUSTRALIA WOMENS CRICKETER LISA STHALEKAR EXPRESSED HER ANGER ON BCCIS TREATMENT OF VEDA KRISHNAMURTHY SA

బీసీసీఐకి మనసు లేదా.. తల్లి,అక్కనుపోగొట్టుకున్న ఆమెకు ఓదార్చు ఎక్కడ..!

బీసీసీఐకి మనసు లేదా..   తల్లి,అక్కనుపోగొట్టుకున్న ఆమెకు ఓదార్చు ఎక్కడ..!

Veda Krishnamurthy

మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి కుటుంబాన్ని చిన్నాభిన్నంచేసింది. ఈ మహమ్మారి కారణంగా రెండు వారాల వ్యవధిలో తన అక్కను, తల్లిని కోల్పోయింది

  • Share this:


    టీమిండియ మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి కుటుంబాన్ని చిన్నాభిన్నంచేసింది. ఈ మహమ్మారి కారణంగా రెండు వారాల వ్యవధిలో తన అక్కను, తల్లిని కోల్పోయింది ఆమె. ఆమె అక్క వత్సల శివకుమార్‌ కరోనా సోకి కొద్దిరోజులు పోరాడి కన్నుమూయగా.. రెండు వారాలకే అదే మహమ్మారి కారణంగా వేదా తల్లి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ తీవ్ర విషాదాలతో ఆమె మానసికంగా కుంగిపోయారు. దీంతో వేదాకు సహాచర క్రికెటర్లు,మాజీ మహిళా క్రికెటర్లు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలో ఐసీసీ ఆల్ ఆఫ్‌ ఫేమ్‌, మాజీ ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ లిసా స్టాలేకర్ కూడా వేదాకు మద్దతుగా ట్విట్ చేశారు. ఆమెను ఓదారుస్తూనే.. బీసీసీఐ విమర్శలు ఎక్కుపెట్టారు.





    ''వేదా ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. బీసీసీఐ మాత్రం ఈ విషయంపై ఏమాత్రం పట్టదన్నట్లుగా ఉండడం దారుణం. ఇంతటి విషాదంలో ఉన్న ఆమె పరామర్శించకపోవడం ఆశ్చర్యం. ఆ సమయంలోనే బీసీసీఐ ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టును ప్రకటించిది. వేదా కృష్ణమూర్తిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం ఆమె బాధలో ఉంది కాబట్టి ఎంపిక చేయలేదని అనుకున్నా.. అది ఆమెకు ఓదార్పు కాదు. టీమిండియాలో వేదా కృష్ణమూర్తిది కీలక పాత్ర. సీనియర్‌ ఫ్లేయరైనా ఆమెను బీసీసీఐ పలికరించలేదు. ఒంటరిగా ఉన్నప్పుడే బాధలు మరింతగా వేధిస్తాయి. బీసీసీఐ ప్రవర్తన సరిగా లేదు'' అంటూ విమర్శించారు.
    Published by:Rekulapally Saichand
    First published:

    అగ్ర కథనాలు