Vasoo Paranjape: గవాస్కర్, సచిన్, ద్రవిడ్, కుంబ్లే, రోహిత్ శర్మ.. ఎంతో మంది క్రికెటర్లను తీర్చిదిద్దిన కోచ్ హఠాన్మరణం

దిగ్గజ క్రికెటర్లను అందించిన గ్రేట్ కోచ్ వాసూ పరాంజపే ఇక లేరు (PC: Twitter)

భారత క్రికెట్ జట్టుకు ఆడి దిగ్గజ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న ఎంతో మందికి కోచ్, మెంటార్‌గా వ్యవహరించిన వాసూ పరాంజపే మరణించారు. క్రికెటర్ల టాలెంట్‌ను గుర్తించడంలో వాసూకు సాటి ఎవరూ లేరని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. కోచ్ మరణం పట్ల క్రికెట్ లోకం విషాదంలో నిండిపోయింది.

 • Share this:
  ఆయన కోచ్‌గా ఉంటే తిరుగుండదు.. ఒక క్రికెటర్ టెక్నిక్ తప్పుంటే వెంటనే పట్టేసి వారిని దారిలో పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరా.. ఇద్దరా? ఎంతో మంది లెజెండ్లను తయారు చేసిన లెజెండరీ కోచ్ అతను. ఆయనే వాసూ పరాంజపే (Vasoo Paranjape). భారత క్రికెట్‌లో (Indian Cricket) సీనియర్ మోస్ట్ కోచ్, మెంటార్, మాజీ ముంబై ఆటగాడు వాసూ పరాంజపే (82) సోమవారం మృతి చెందారు. ముంబై, బరోడా జట్ల తరపున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 785 పరుగులు చేశాడు. కాగా, ఒక క్రికెటర్‌గా ఆయన ఆడింది తక్కువే అయినా.. కోచ్‌గా మాత్రం అనన్య సామాన్యమైనవి. ఎంతో మంది భారత లెజెండరీ క్రికెట్లను తీర్చిదద్దడంలో పరాంజమే కృషి మరువలేనిది. సునిల్ గవాస్కర్ (Sunil Gavaskar), దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar), రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), యువ్‌రాజ్ సింగ్ (Yuvraj Singh), రోహిత్ శర్మ (Rohit Sharma) వంటి క్రికెటర్లకు ఆయన కోచింగ్ ఇచ్చాడు. టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించడంలో పరాంజపేను మించిన కోచ్ లేడని ఇప్పటికీ చెబుతుంటారు. ఒక క్రికెటర్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది అతడి ఆటను చూసి పరాంజపే చెప్పేస్తుంటాడట. 1960, 70లలో ముంబైలో దాదార్ యూనియర్ స్పోర్ట్స్ క్లబ్ అనేది చాలా ఫేమస్. ఆ క్లబ్ తరపున ఆడాలని ఎంతో మంది కలలు కంటుంటారు. ముంబై నుంచి కాకుండా దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు దాదర క్లబ్‌లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండే వాళ్లు. ఆ సమయంలో పరాంజపే ఆ క్లబ్‌లో కెప్టెన్, కోచ్, మెంటార్‌గా ఉన్నాడు. ఎంతో మంది క్రికెటర్ల సహజమైన టాలెంట్‌ను గుర్తించడంలో పరాంజపే సఫలమయ్యాడు.

  తాను తొలి సారిగా దాదర్ క్లబ్‌ కోసం ఆడినప్పుడు వాసూ పరాంజపే కెప్టెన్‌గా ఉన్నాడని వెంగ్‌సర్కార్ చెప్పారు. తన తొలి కెప్టెన్ వాసూ పరాంజపే అని వెంగ్‌సర్కాన్ అన్నాడు. వెంగ్‌సర్కాట్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉన్నప్పుడు ముంబైలోని పార్శీ జింఖానా గ్రౌండ్‌లో ఒక మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ సమయంలో వాసూ పరాంజపే అక్కడకు వచ్చి వాసూని తన వెంట రమ్మని చెప్పాడు. ఎందుకు అని ప్రశ్నించగా.. అవన్నీ కాదు నాతో రా అని చెప్పి సీసీఐ గ్రౌండ్‌కు తీసుకొని వెళ్లాడు. అక్కడ ఒక చిన్న పిల్లవాడు అద్భుతంగా ఆడుతుండటం చూపించి.. అతడు అద్భుతాలు సృష్టించగలడు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ కుర్రాడు ప్రపంచం మెచ్చే క్రికెటర్ అయ్యాడు. అతనే సచిన్ టెండుల్కర్. ఇలా టాలెంట్ ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్టేసేవాడని పరాంజపే గురించి వెంగ్‌సర్కార్ గుర్తు చేసుకున్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన రోజు.. క్రికెట్ గురించి ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి, అద్భుతమైన కెప్టెన్, ఎంతో మందిని ప్రభావితం చేసిన స్పూర్తిప్రధాత లేకపోవడం బాధాకరమని వెంగ్‌సర్కార్ అన్నాడు. టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి మృతికి నివాళులు అర్పించారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను మరిచిపోలేమని శాస్త్రి ఒక ట్వీట్ చేశారు. అతడి మరణం తనను కలచివేసిందని చెప్పారు.

  Paralympics: పారాలింపిక్స్‌లో ఆ పతకం పోయింది.. వినోద్ కుమార్‌ను అనర్హుడిగా ప్రకటించిన నిర్వాహకులు


   వాసూ పరాంజపే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్ చేసే వారు. ఆయన దాదర్ యూనియన్ క్లబ్ కోసం ఎన్నో ట్రోఫీలను అందించాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పనిచేశారు. ఎన్నో యువ జట్లకు కూడా కోచింగ్ సేవలు అందించారు. 'క్రికెట్ ద్రోణ: ఫర్ ద లవ్ ఆఫ్ వాసూ పరాంజపే' అనే పుస్తకాన్ని ఆయన కొడుకు జతిన్, జర్నలిస్ట్ ఆనంద్ వాసు కలసి రచించారు. అందులో ఎంతో మంది భారత క్రికెటర్ల గురించి రాశారు. రోహిత్ శర్మ గురించి ఆ పుస్తకంలో మెన్షన్ చేశారు. ముంబై అండర్-17 జట్టులో ఆడుతున్న సమయంలోనే బరోడాపై రోహిత్ తొలి సెంచరీ కొట్టిన విషయాన్ని జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ఆమ్రే, సీనియర్ ప్యానల్ హెడ్ కిరణ్ మోరేకు చెప్పారట. ఆ కుర్రాడు చాలా టాలెంటెడ్.. జాతీయ జట్టులో రాణించగలడని రోహిత్ గురించి ముందే అంచనా వేసిన వ్యక్తి వాసూ పరాంజపే. రోహిత్ శర్మ కూడా ఒక విషయాన్ని గుర్తు చేశాడు. తాను వాంఖడేలో ప్రాక్టీస్ చేసే సమయంలో కెప్టెన్ దగ్గరకు వెళ్లి.. ఈ కుర్రాడిని జట్టులోకి తీసుకోండి.. నీకు జోడీగా బరిలోకి దిగితే ఇంకా రాణిస్తాడు అని అప్పటి కెప్టెన్ ప్రశాంత్ నాయక్‌కు చెప్పాడు. ప్రశాంత్ నాయక్ వెంటనే రోహిత్ దగ్గరకు వెళ్లి.. నీ గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ వాసూ సార్ నీ టాలెంట్ గురించి అంచనా వేశారు. కాబట్టి జట్టులోకి తీసుకుంటున్నాను. రేపటి మ్యాచ్ నువ్వు ఆడుతున్నావని రోహిత్‌కు ప్రశాంత్ చెప్పాడు. ఆ తర్వాత రోహిత్‌కు తిరుగే లేకుండా పోయింది.


  సచిన్ టెండుల్కర్‌ను జాతీయ జట్టులోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు అప్పటి చీఫ్ సెలెక్టర్ రాజ్ సింగ్ దుంగార్పూర్.. వాసూ పరాంజపేకి కాల్ చేశారు. సచిన్‌పై నీ అభిప్రాయం ఏంటి అని వాసూని అడిగారు. వాసూ వెంటనే... 'సచిన్‌ని జట్టులోకి తీసుకోండి. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ల భరతం పడతాడు' అని చెప్పాడు. రాహుల్ ద్రవిడ్‌కు కూడా వికెట్ కీపింగ్ కంటే బ్యాటింగ్ మీద దృష్టిపెట్టమని వాసూ పరాంజపే చెప్పారు. అప్పుడ ద్రవిడ్ వయసు 14 ఏళ్లు. అప్పటి నుంచి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టిన ద్రవిడ్.. ది వాల్‌గా మారిపోయాడు. ఒక జాతీయ క్యాంప్‌కు బ్యాట్స్‌మాన్ లాగా వచ్చిన అనిల్ కుంబ్లేను లెగ్ స్పిన్ వైపు మోటివేట్ చేసింది పరాంజపేనే. దీంతో కుంబ్లే లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా మారిపోయాడు. ఇలా ఎంతో మంది క్రికెటర్లను వాసూ పరాంజపే తయారు చేశాడు.

  Stuart Binny Retired: భార్య పోస్టు పెట్టిన రెండు రోజులకే.. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ


   

  Published by:John Naveen Kora
  First published: