రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్

నాలుగు టీమ్‌లతో జరిగే అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్‌లో 100 పైగా అమ్మాయిలు పాల్గొంటారు. 2020 అక్టోబర్‌లో ఫీఫా అండర్-17 వుమెన్స్ వాల్డ్‌ కప్‌ను ఇండియా నిర్వహిస్తుండటం విశేషం.

news18-telugu
Updated: August 31, 2019, 2:27 PM IST
రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్
రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియాలో స్పోర్ట్స్ అంటే ముందు క్రికెట్, ఆ తర్వాత బ్యాడ్మింటన్ ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. అంతర్జాతీయంగా బాగా క్రేజ్ ఉన్న ఫుట్‌‌బాల్‌పై ఇండియాలో ఆసక్తి తక్కువే. భారతదేశంలో ఫుట్‌బాల్‌పై క్రేజ్ పెంచడంతో పాటు, అమ్మాయిలు ఈ క్రీడను ఎంచుకునేలా ప్రోత్సహించేందుకు ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ కొత్త ప్రణాళికల్ని ప్రకటించారు. ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2019-20 సీజన్‌లో నాలుగు టీమ్‌లతో అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్, చిల్డ్రన్స్ లీగ్ జరగబోతోంది. ముంబైలో ఇండియన్ సూపర్ లీగ్ ఓనర్స్‌తో జరిగిన సమావేశంలో నీతా అంబానీ తన ఆలోచనల్ని పంచుకున్నారు.

లక్షలాది మంది పిల్లల్ని వేర్వేరు క్రీడల్లో పరిచయం చేయాలన్నది నా ఆలోచన. ఐఎఎల్ క్లబ్ అకాడమీస్, రిలయెన్స్ ఫౌండేషన్ యంగ్ ఛాంప్స్, రిలయెన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ద్వారా కొన్నేళ్లుగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేయడం, టాలెంట్ గుర్తించడంతోపాటు భారతదేశంలోని యువతీ యువకులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ప్రొఫెషనల్ వాతావరణం కల్పిస్తున్నాం. రిలయెన్స్ ఫౌండేషన్ యంగ్ ఛాంప్స్, రిలయెన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ద్వారా 90 లక్షల మంది పిల్లలకు అవకాశాలు కల్పించడం విశేషం.
నీతా అంబానీ, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్


Football Sports Development Limited, Reliance Foundation, Under 17 Womens Tournament, ISL Children’s Leagues, FIFA U-17 Women’s World Cup in India, Nita Ambani, Star Sports, Hotstar, Jio TV, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, రిలయెన్స్ ఫౌండేషన్, నీతా అంబానీ, అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్, చిల్డ్రన్స్ లీగ్, స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌, జియో టీవీ
చిత్రంలో FSDL, రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, ఐఎస్ఎల్ క్లబ్ ఓనర్స్ అక్షయ్ టాండన్ (FC Goa), విజయ్ మద్దూరి (Hyderabad FC), పార్థ్ జిందాల్ (BFC), సంజయ్ గుప్తా (Star Sports), చిరంజీవి (KBFC), జాన్ అబ్రహాం (NEUFC), ప్రఫుల్ పటేల్ (AIFF), అభిషేక్ బచ్చన్ (CFC), రణ్‌బీర్ కపూర్ (MCFC), సంజీవ్ గోయెంకా (ATK), డాక్టర్ అనిల్ శర్మా (DDFC), చాణక్య చౌదరీ (JFC)
నాలుగు టీమ్‌లతో జరిగే అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్‌లో 100 పైగా అమ్మాయిలు పాల్గొంటారు. 2020 అక్టోబర్‌లో ఫీఫా అండర్-17 వుమెన్స్ వాల్డ్‌ కప్‌ను ఇండియా నిర్వహిస్తుండటం విశేషం. అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్‌లో సత్తా చాటిన అమ్మాయిలు వచ్చే ఏడాది జరిగే ఫీఫా అండర్-17 వుమెన్స్ వాల్డ్‌ కప్‌లో ఇండియా తరఫున ఆడనున్నారు. అండర్-17 వుమెన్స్ టోర్నమెంట్‌ నవంబర్‌లో జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీలో ఈ మ్యాచ్‌లు లైవ్‌లో చూడొచ్చు.

2017లో ఫీఫా అండర్-17 వాల్డ్ కప్ నిర్వహించడం ద్వారా యువతలో ఫుట్‌బాల్‌పై ఇష్టం పెరిగింది. 2020 ఫీఫా అండర్-17 వుమెన్స్ వాల్డ్ కప్ నిర్వహిస్తే అదే స్ఫూర్తితో ప్రయాణం కొనసాగుతుందని అనుకుంటున్నాను. అండర్-17 వుమెన్స్ వాల్డ్ కప్‌తో పాటు చిల్డ్రన్స్ లీగ్ ద్వారా భారతదేశంలో ఫుట్‌బాల్‌ పాపులర్ అవుతుందని మేం భావిస్తున్నాం.
నీతా అంబానీ, ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, రిలయెన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్
ఇక ఐఎస్ఎల్ ఇండియన్ చిల్డ్రన్స్ లీగ్ కూడా భారతదేశంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి పెంచడానికి రూపొందించిన కార్యక్రమమే. వచ్చే 3 ఏళ్లలో దేశంలోని 12 రాష్ట్రాల్లో 6, 8, 10, 12 ఏళ్లకు చెందిన 38,000 మంది పిల్లలకు ఫుట్‌బాల్‌లో అవకాశాలు కల్పించనుంది ఐఎస్ఎల్ ఇండియన్ చిల్డ్రన్స్ లీగ్. మొదటి దశలో పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలోని 15 జిల్లాల్లో లీగ్స్ నిర్వహించనుంది. 2021-22 నాటికి 12 రాష్ట్రాల్లోని 40 జిల్లాల్లో 38,000 మంది పిల్లలు ఈ లీగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించనుంది.

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే

Traffic Fines: సెప్టెంబర్ 1 నుంచి మారే ట్రాఫిక్ ఫైన్స్ ఇవే...
First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>