Home /News /sports /

FOOTBALL MATCH BETWEEN BOCHUM AND MONCHENGLADBACH ABANDONED AFTER A FAN THROWN BEER CUP TO ASSISTANT REFEREE SJN

Football: ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా బీర్ కప్పుతో రిఫరీ తల బద్దలు కొట్టిన అభిమాని.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రిఫరీ

రిఫరీ

Football: ఇండియా (India)లో క్రికెట్ (Cricket)కు ఎంతటి ఆదరణ ఉంటుందో... అదే విధంగా యూరప్ దేశాల్లో ఫుట్ బాల్ (Football)కు అంత క్రేజ్ ఉంటుంది. ఇక్కడ క్రికెట్ ను మనం మతంలా ఎలా భావిస్తామో... యూరప్ దేశాల్లో ఫుట్ బాల్ ను కూడా అదే విధంగా ఆరాధించే అభిమానులు ఉంటారు. జర్మనీ వేదికగా జరిగే ఫుట్ బాల్ లీగ్ టోర్నమెంట్ లో  అపశృతి చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
Football: ఇండియా (India)లో క్రికెట్ (Cricket)కు ఎంతటి ఆదరణ ఉంటుందో... అదే విధంగా యూరప్ దేశాల్లో ఫుట్ బాల్ (Football)కు అంత క్రేజ్ ఉంటుంది. ఇక్కడ క్రికెట్ ను మనం మతంలా ఎలా భావిస్తామో... యూరప్ దేశాల్లో ఫుట్ బాల్ ను కూడా అదే విధంగా ఆరాధించే అభిమానులు ఉంటారు. ఇంగ్లండ్ (England) వేదికగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, స్పెయిన్ వేదికగా ల లీగ, ఇటలీ (Italy) వేదికగా సెరి ఎ లీగ్, జర్మనీ వేదికగా బుండెస్ లిగా ఫుట్ బాల్ లీగ్ లు యూరప్ లో సూపర్ పాపులర్ అయ్యాయి. జర్మనీ వేదికగా జరుగుతోన్న బుండెస్ లిగా ఫుట్ బాల్ లీగ్ లో  అపశృతి చోటు చేసుకుంది.

శుక్రవారం రాత్రి  బోచుమ్, బోరుస్సియా మోన్ చెన్ గ్లాడ్‌బాచ్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్ లో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన గ్లాడ్ బాచ్ టీం 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఇక్కడే మైదానంలో ఊహించన ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ చూడటానికి వచ్చిన బోచుమ్ అభిమాని చేసిన ఒక తుంటరి పనితో మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. బోచుమ్ జట్టు 0-2తో వెనుకబడి ఉన్న నేపథ్యంలో తమ జట్టు ఓడిపోతుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన అభిమాని తన చేతిలో ఉన్న బీర్ కప్పును అసిస్టెంట్ రిఫరీపైకి విసిరాడు. ఆ బీర్ కప్పు కాస్తా రిఫరీ తలపై బలంగా తగిలింది. దాంతో అతడు మోకాళ్లపై మైదానంలోనే కూర్చుండిపోయాడు.



రెండో అర్ధ భాగం మొదలైన తర్వాత ఆట 71వ నిమిషంలో అసిస్టెంట్‌ రిఫరీ క్రిస్టియన్‌పై సదరు ఆకతాయి బీర్‌ కప్పును విసిరాడు. అది వచ్చి నేరుగా అసిస్టెంట్ రిఫరీ తలకు బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడిన క్రిస్టియన్ వెంటనే మోకాళ్లపై కూలబడిపోయాడు. వెంటనే ప్రధాన రిఫరీ మ్యాచ్ ను ఆపేసి అసిస్టెంట్ రిఫరీ దగ్గరకు వెళ్లాడు. ఇరు జట్ల ప్లేయర్స్ కూడా గాయపడ్డ రిఫరీ దగ్గరకు వెళ్లి అతడి పరిస్థితిని తెలుసుకున్నారు.  గ్లాడ్ బాచ్ ఆటగాళ్లు ఫ్యాన్స్ వద్దకు వెళ్లి మీరు చేస్తుంది తప్పంటూ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో మ్యాచ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. దాదాపు 20 నిమిషాల చర్చించిన అనంతరం ఆటగాళ్ల భద్రత దృష్ట్యా మ్యాచ్ ను రద్దు చేసేందుకే నిర్వాహకులు మొగ్గు చూపారు. మ్యాచ్‌ను సజావుగా జరగనీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం కోసం రిఫరీని గాయపరిచినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లీగ్‌ తెలిపింది.  నెల రోజుల క్రితం మెక్సికో ఫుట్ బాల్  లీగ్ లో మ్యాచ్ జరగుతున్న సమయంలో అభిమానులు మైదానంలో గొడవ పడిన సంగతి తెలిసిందే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, England, Foot ball, Italy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు