సాధారణంగా సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే. మరి అలాంటిది.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) చేస్తే సంచలనంగా మారకుండా ఉంటుందా చెప్పండి. ఇన్స్టాగ్రామ్ (Instagram) లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వ్యక్తిగా రొనాల్డోకు పేరు ఉంది. అలాంటి రొనాల్డో ఏది చేసినా ఇట్టే వైరలవుతుంది. అది మంచైనా సరే.. చెడు అయినా సరే. లేటెస్ట్ గా తన అభిమానులకు క్రిస్టియానో రొనాల్డో క్షమాపణలు తెలిపాడు. నిన్న ఎవర్టెన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను మాంచెస్టర్ యునైటెడ్స్ (Manchester United) 1-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు పోడియంలోకి వెళ్తుండగా.. అభిమానులు హాయ్ చెబుతూ కరచాలనం ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. అయితే ఓటమి కోపంతో ఉన్న రొనాల్డో ఓ ప్రేక్షకుడి ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరలయింది. ఇంకేముంది ప్రపంచవ్యాప్తంగా రొనాల్డ్ తీరుపై విమర్శలు చెలరేగాయ్.
క్రిస్టియానో రొనాల్డో వంటి ఓ దిగ్గజ ప్లేయర్ ఇలాంటి కోపాన్ని అదుపుచేయలేక ఫ్యాన్స్ రెచ్చిపోవడం ఏంటి అని ప్రశ్నించారు.
దీంతో క్రిస్టియానో ఫుట్‌బాల్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
"క్లిష్టమైన సమయాల్లో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం సులువైన విషయం కాదు. నేను ప్రతిసారీ ఇతరుల పట్ల గౌరవభావం, ఓపికతోనే ఉంటాను. అందమైన గేమ్‌ను ఆస్వాదించే యువతకు ఆదర్శంగా నిలుస్తాం. నిన్న జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతున్నా. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు నా అభిమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా" అని క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు.
రొనాల్డో సారి చెప్పడంపై కూడా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. " బాబు రొనాల్డో చేసిదంతా చేసి ఇప్పుడు సారీ చెబితే ఎలా.. ఇప్పటికే లేట్ అయింది.. " అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు రొనాల్డో సారీ చెప్పడం గ్రేట్ అని ఫుట్ బాల్ స్టార్ ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే, రొనాల్డో ఫోన్‌ను విసిరిగొట్టిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేశాడు. అయితే, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు అందడం వల్ల దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.