Home /News /sports /

FOOT BALL PLAYER DIED EAST BENGAL BOUND PLAYER DEBOJYOTI GHOSH DIED DUE TO HEART ATTACK DURING THE FOOTBALL MATCH SJN

Foot ball player died: ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ మైదానంలోనే మరణించిన యువ ప్లేయర్

దేవొజ్యోతి ఘోష్ (PC: TWITTER)

దేవొజ్యోతి ఘోష్ (PC: TWITTER)

Foot ball player died: వెస్ట్ బెంగాల్ (East Bengal)లో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది. లోకల్ ఫుట్ బాల్  (Football) టోర్నీలో భాగంగా అక్కడి  కృష్ణానగర్ సెంట్రల్, నవద్వీప్ సేవక్ సమితి జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఘోరం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
Foot ball player died: వెస్ట్ బెంగాల్ (west Bengal)లో జరిగిన ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటు చేసుకుంది. లోకల్ ఫుట్ బాల్  (Football) టోర్నీలో భాగంగా అక్కడి  కృష్ణానగర్ సెంట్రల్, నవద్వీప్ సేవక్ సమితి జట్లు మధ్య జరిగిన మ్యాచ్ లో ఘోరం చోటు చేసుకుంది.  కృష్ణానగర్ సెంట్రల్ జట్టు తరఫున  25 ఏళ్ల దేవజ్యోతి ఘోష్ పాల్గొన్నాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతి (Ball) అతడి ఛాతికి బలంగా తాకింది. అనంతరం అతడు తిరిగి ఆటను మొదలు పెట్టినా... కాసేపటికే మైదానంలో కుప్పకూలిపోయాడు. మ్యాచ్ రిఫరీలు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అతడిని పరిశీలించిన వైద్యులు ఘోష్ గుండెపోటుతో అప్పటికే మరణించినట్లు పేర్కొన్నారు.

అయితే మ్యాచ్ నిర్వహణపై సందేహాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. ఘోష్ మైదానంలో కుప్పకూలిని చాలా సేపటికి అక్కడికి అంబులెన్స్ చేరుకుందని తెలుస్తోంది. ఫుట్ బాల్ టోర్నమెంట్ శారీరక శ్రమతో కూడుకున్నది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఆటగాళ్లు మైదానంలో పురుగెడుతూనే ఉంటారు. సగటున ప్రతి ప్లేయర్ కూడా దాదాపు 7 కిలో మీటర్ల కంటే కూడా ఎక్కువ దూరం పరుగెత్తే అవకాశం ఉంది. అటువంటి చోట ప్రమాదాలు జరగడం సాధారణం. బంతి గుండెకు లేదా తలకు తగిలితే అది ఆటగాళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయినప్పటికీ నిర్వాహకులు కనీసం ఒక అంబులెన్స్ ను కూడా ఉంచుకోలేదని తెలుస్తోంది.

మరణించిన ఘోష్ రైల్వే ఫుట్ బాల్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన ప్రతిభతో విఖ్యాత టీం ఈస్ట్ బెంగాల్ జట్టులో చోటు కూడా దక్కించుకున్నాడు. 2022 2023 సీజన్ లో అతడు ఈస్ట్ బెంగాల్ తరఫున ఆడాల్సి ఉంది అయితే అంతలోనే అతడు బంతి తగిలి మరణించడం క్రీడా లోకాన్ని విషాదంలోకి నెట్టింది. అతడి మరణంపై పలు టీంలు సంతాపం తెలిపాయి.

భారత్ లో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ ప్లేయర్స్ మరణించడం ఇదేమీ కొత్త కాదు. 2004లో బ్రెజిల్ కు చెందిన క్రిస్టియానో జూనియర్ కూడా మైదానంలో మరణించాడు. 2004 డిసెంబర్ 5న ఫెడరేషన్ కప్ ఫైనల్స్ లో డెంపో టీమ్ తో మోహన్ బగాన్ జట్టు తలపడింది.  డెంపో టీం తరఫున ప్రాతినిధ్యం వహించిన అతడు మ్యాచ్ లో రెండు గోల్స్ కూడా చేశాడు. రెండో గోల్ చేసే క్రమంలో క్రిస్టియానో జూనియర్ మోహన్ బగాన్ గోల్ కీపర్ సుబ్రతా పాల్ ను ఢీకొన్నాడు. వెంటనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్రిస్టియానో జూనియర్ ను హాస్పిటల్ కు తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. 1993లో సంజీబ్ దత్ కూడా ఫుట్ బాల్ మ్యాచ్ ఆడుతూ మైదానంలో మరణించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Death, Football, Heart Attack, West Bengal

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు