టోక్యో (Tokyo) వేదికగా పారాలింపిక్స్ (Paralympics 2020) ప్రారంభానికి ముందు భారత అథ్లెట్ల బృందానికి పెద్ద షాక్ తగిలింది. రియో పారాలింపిక్స్ 2016లో స్వర్ణ పతాక విజేత, ఈ రోజు ఓపెనింగ్ సెర్మనీలో పతాకం పట్టుకొని మార్చ్ పాస్ట్‌లో ముందుండి నడిపించాల్సిన మరియప్పన్ తంగవేలు (Mariyappan Tangavelu) క్వారంటైన్‌కు (Quarantine) వెళ్లాల్సి వచ్చింది. టోక్యో వెళ్లేందుకు అతను ఎక్కిన విమానం పక్క సీటులో ఉన్న వ్యక్తి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పారాలంపిక్స్ నిర్వాహకులు ముందు జాగ్రత్తగా తంగవేలును క్వారంటైన్‌కు పంపించారు. ఈ విషయాన్ని పారాలింపిక్స్ కమిటీ ధృవీకరించింది. దీంతో ప్రారంభోత్సవంలో పతకాన్ని చేబూని ముందుండి నడిపించే అవకాశం మరో పారా అథ్లెట్ టేక్ చంద్‌కు వచ్చింది. మరియప్పన తంగవేలు కూర్చున్న సీటు దగ్గరి వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వెంటనే తంగవేలును క్వారంటైన్‌కు పంపిన విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ధృవీకరించింది. 'మరియప్పన్ తో పాటు మరో ఐదుగురిని క్వారంటైన్లో ఉంచాము. అయితే వారికి కోవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్ ఫలితాలే వచ్చాయి. గత ఆరు రోజులుగా వాళ్లు పాజిటివ్ రాలేదు. అయినా ముందు జాగ్రత్తగా వారిని క్వారంటైన్ చేశాము. తంగప్పన్ బదులుగా టేక్ చంద్‌ను పతాకధారిగా పంపనున్నాము' అని డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అర్హన్ బగాటి ఒక వీడియోలో చెప్పారు.
పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి గుర్షామ్ సింగ్ కూడా మరియప్పన్ విషయాన్ని ధృవీకరించారు. అయితే ప్రస్తుతం మరియప్పన్‌తో పాటు క్వారంటైన్లో ఉన్న మిగిలిన పారా అథ్లెట్లు బాగానే ఉన్నారని.. వారు ప్రతీ రోజు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారని చెప్పారు. పారాలింపిక్ నిర్వాహకులు వారి శిక్షణకు ఎలాంటి ఆటంకాలు పెట్టలేదని ఆయన చెప్పారు. భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు 9 ఈవెంట్లలో బరిలోకి దిగుతున్నారు. గత రియో ఒలింపిక్స్‌లో భారత్ రెండు స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం దక్కించుకున్నది. ఈ సారి 15 పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత అథ్లెట్ల బృందం పట్టుదలగా ఉన్నది.
Mariyappan Thangavelu our Flag Bearer, with 5 others, have been quarantined until further notice, as someone near to their seats on their flight to Tokyo tested COVID+! However, none of them have turned +ve since the past 6days! Tek Chand will now be our Flag Bearer. Pls watch! pic.twitter.com/z0fmnP9mvW
— Arhan Bagati (@IamArhanBagati) August 24, 2021
భారత పారా అథ్లెట్లు 1968 నుంచి జరుగుతున్న పారాలింపిక్స్‌లో 12 పతకాలు గెలిచారు. వాటిలో అత్యధికంగా గత రియో ఒలింపిక్స్‌లో 5 గెలవడం విశేషం. ఈ సారి కనీసం 15 పతకాలు సాధించాలని భారత అథ్లెట్ల బృందం లక్ష్యంగా పెట్టుకున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics