Home /News /sports /

FIVE TIMES VIRAT ANUSHKA WON THE INTERNET WITH THEIR CUTE PDA MOMENTS DURING CRICKET MATCHES GH SA

Anushka Sharma: గ్రౌండ్‌లో కోహ్లీ.. స్టాండ్‌లో అనుష్క .. ఫ్లయింగ్ కిస్‌లు..మూగ భాసలు!!

Anushka Sharma 2

Anushka Sharma 2

విరాట్ ఆడుతున్న మ్యాచ్‌లను క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించడం ఆమెకు అలవాటు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఈ జంట ప్?

కోహ్లీ, అనుష్క దంపతులకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఈ జంటను అభిమానులు ‘విరుష్క’ అని పిలుస్తారు. ఇటీవల వీరికి ఒక పాప కూడా పుట్టింది. అనుష్క పుట్టిన రోజు సందర్భంగా.. ఆమెకు సంబంధించిన కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. చాలామంది భారతీయుల మాదిరిగానే అనుష్క కూడా క్రికెట్ అభిమాని. విరాట్ ఆడుతున్న మ్యాచ్‌లను క్రికెట్ స్టేడియంలో ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించడం ఆమెకు అలవాటు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఈ జంట ప్రత్యేకమైన సైగలు, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిపుచ్చుకోవడం చూసి ఫ్యాన్స్ ముచ్చటపడతారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు వీరిద్దరూ ప్రేమను పంచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో టాప్-5 సందర్భాలను చూద్దాం.

* గత ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్లో.. స్టాండ్లలో ఉన్న అనుష్కను కోహ్లీ ఒక ప్రశ్న అడుగుతున్నట్లు సైగ చేశాడు. ఐపీఎల్‌ 2020 సందర్భంగా అక్టోబర్ 25న చెన్నై, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మధ్యలో కోహ్లీ తన భార్యను భోజనం చేశావా అని సైగ చేసి అడగడం.. దీనికి ఆనుష్క బొటనవేలు చూపించి తిన్నానని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది.

* ఐపీఎల్ 2020 సీజన్‌ సందర్బంగా అక్టోబర్ 10న ఆర్సీబీ, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 90 పరుగులు చేశాడు. అప్పటికి అనుష్క స్టాండ్‌లో ఉంది. మ్యాచ్‌లో విశ్వరూపం చూపిన కోహ్లీకి, అనుష్క ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ వీడియో కూడా అభిమానులను అలరించింది.

* 2018 ఆగస్టులోనూ వీరిద్దరికి సంబంధించిన మరో వీడియో వైరల్ అయ్యింది. ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విరాట్, అనుష్క ఒకరికొకరు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చుకున్నారు. కోహ్లీ సెంచరీ చేసి, అనుష్క వైపు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా, అనుష్క కూడా సంతోషంతో రిప్లై ఇచ్చింది.

* 2014 డిసెంబర్‌లో వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఫ్యాన్స్‌కు మొదటిసారి తెలిసింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధించిన తర్వాత అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ మూడవ సెంచరీ సాధించిన తరువాత ఈ సంఘటన జరిగింది.

* 2014 నవంబర్ 10న కోహ్లీ మొదటిసారి స్టేడియంలో అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆ రోజు జరిగిన వన్డే మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. అనుష్క స్టాండ్స్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన కోహ్లీ హెల్మెట్ తీసి అనుష్కకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.

https://www.instagram.com/p/BzlZtHwn9mn/?utm_source=ig_embed

https://twitter.com/_heavenlyInsane/status/1314966103177658370?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1314966103177658370%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fcricketnext%2Fnews%2Fhappy-birthday-anushka-sharma-five-times-virat-anushka-won-the-internet-with-their-cute-pda-moments-during-cricket-matches-3693800.html

https://www.instagram.com/p/BzlS0iNn4dp/?utm_source=ig_embed

https://www.instagram.com/p/BmtVptQACch/?utm_source=ig_embed

https://twitter.com/AnushkaNews/status/1204811490278215680?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1204811490278215680%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.news18.com%2Fcricketnext%2Fnews%2Fhappy-birthday-anushka-sharma-five-times-virat-anushka-won-the-internet-with-their-cute-pda-moments-during-cricket-matches-3693800.html
First published:

Tags: Anushka Sharma, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు