హోమ్ /వార్తలు /క్రీడలు /

ఒలింపిక్స్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ వెయిట్ లిఫ్టర్.. చరిత్ర సృష్టించడానికి ముందే వివాదాలు

ఒలింపిక్స్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ వెయిట్ లిఫ్టర్.. చరిత్ర సృష్టించడానికి ముందే వివాదాలు

న్యూజీలాండ్‌కు చెందిన లారెల్ హుబ్బార్డ్ (Laurel Hubbard ) ఒలింపిక్స్‌లో (Olympics) లో ప్రాతినిథ్యం వహించనున్న తొలి ట్రాన్స్‌జెండర్ (Transgender Athlete) అథ్లెట్‌గా రికార్డు సృష్టించనున్నది. టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొననున్నది. ఒలింపిక్స్‌లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక కేటగిరీ లేకపోవడంతో హుబ్బార్డ్ మహిళల కేటగిరీలో పోటీ పడబోతున్నది. గత వారమే న్యూజీలాండ్ ఒలింపిక్స్ కమిటీ హుబ్బార్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో చోటు దక్కించుకున్నట్లు కూడా ప్రకటించింది. ప్రపంచమంతా ఎల్జీబీటీ హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో ఒక ట్రాన్స్‌జెండర్ అత్యున్నత స్థాయి క్రీడల్లో పోటీ పడటానికి అర్హత సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా పడ్డాయి. లేకపోయితే ఇప్పటికే హుబ్బార్డ్ రికార్డు సృష్టించి ఉండేది. హుబ్బార్డ్ గతంలో పసిఫిక్ గేమ్స్‌లో స్వర్ణ పతకం, వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో వెండి పతకం గెలుచుకున్నది. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా కూడా హుబ్బార్డ్ రికార్డులకు ఎక్కింది. ఇక ఇప్పుడు ఏకంగా ఒలింపిక్స్‌లోనే పాల్గొనే అవకాశం రావడంతో మరో రికార్డు సృష్టించడానికి వేచి చూస్తున్నది.

అయితే హుబ్బార్డ్ మహిళల కేటగిరీలో పోటీ పడటంపై కూడా వివాదం నెలకొన్నది. పురుషుడిగా పుట్టి లింగ మార్పిడి చేయించుకొని మహిళా మారడం వల్ల వారిలో మగవారిలో ఉండే శక్తి ఉంటుందని మిగతా లిఫ్టర్లు అంటున్నారు. మాజీ ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ ట్రేసీ లాంబ్రెక్స్.. హుబ్బార్డ్ అర్హతను ప్రశ్నిస్తున్నారు. ఇది సరైన ఎంపిక కాదని అంటున్నారు. ఒక మహిళకు రావల్సిన బెర్త్.. పురుషుడి నుంచి స్త్రీగా మారిన వ్యక్తికి కేటాయించడం సరైనది కాదని ట్రేసీ వాదిస్తున్నారు. పసిఫిక్ గేమ్స్‌లో హుబ్బార్డ్‌కు స్వర్ణ పతకం గెలుచుకునే అర్హత లేదు. వాస్తవానికి ఆ పతకం రెండో స్థానంలో నిలిచిన మహిళలా వెయిట్ లిఫర్ట్ ఫెగైగా స్టోవర్స్‌కు దక్కాల్సిందని ఆమె అంటున్నారు. కానీ పురుషుడి నుంచి స్త్రీగా మారిన హుబ్బార్డ్ ఆ పతకాన్ని గెలుచుకుందని ఆమె ఎద్దేవా చేశారు.


1978లో గావిన్ హుబ్బార్డ్ జన్మించాడు. అతని తండ్రి డిక్ హుబ్బార్డ్ ఆక్లాండ్ సిటీకి మాజీ మేయర్. వారికి హుబ్బార్డ్ ఫుడ్స్ అనే సంస్థ ఉన్నది. గావిన్ హుబ్బార్డ్ లింగ మార్పిడి చేయించుకోక ముందు న్యూజీలాండ్ జూనియర్స్ కేటగిరీలో పోటీ పడి ఎన్నో పతకాలు సాధించాడు. కానీ తర్వాత కాలంలో లింగ మార్పిడి చేయించుకొని లారెల్ హుబ్బార్డ్‌గా మారిపోయింది. అదే సమయంలో ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ న్యూజీలాండ్ కమిటీకి ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్‌గా కూడా పని చేసింది. కాగా, గతంలో పవర్ లిఫ్టింగ్‌లో ట్రాన్స్‌జెండర్‌లను మహిళల విభాగంలో పోటీ పడటాన్ని నిషేధించింది. కానీ మారిన నిబంధనల మేరకు లారెల్‌కు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.

First published:

Tags: Tokyo Olympics, Transgender

ఉత్తమ కథలు