IPL 2021 : ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఒకే సమయంలో రెండు మ్యాచ్ లు..! ఎలా చూడాలంటే..

IPL 2021

IPL 2021 : ఇవాళ ఐపీఎల్ 2021 లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో జరగనున్నాయ్. IPL లో గ్రూప్ ఫేజ్ చివరి రోజు ఏకకాలంలో మ్యాచ్‌లు ఆడడం ఇదే మొదటిసారి.

  • Share this:
    ఐపీఎల్ 2021(IPL 2021 Season Latest Updates) సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే చెన్నై (CSK), ఢిల్లీ (DC), బెంగళూరు (RCB) ప్లే ఆఫ్స్ చేరుకోగా.. నాలుగో స్థానం దాదాపు కోల్ కతా వశమైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తేనే ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడుతోంది. దాదాపు, ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఇక, ఇవాళ ఐపీఎల్ 2021 లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్‌లు ఏకకాలంలో జరగనున్నాయ్. IPL లో గ్రూప్ ఫేజ్ చివరి రోజు ఏకకాలంలో మ్యాచ్‌లు ఆడడం ఇదే మొదటిసారి. మునుపటి షెడ్యూల్ ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్‌తో ఒక రోజు ఆటలో మధ్యాహ్నం 3:30 కి తలపడాల్సి ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 కి జరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 కి జరుగుతాయి.

    ఇక, ఈ మ్యాచ్ లు ప్రసారమయ్యే ఛానళ్లు..:

    * RCB Vs DC : స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ - 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1, స్టార్ స్పోర్ట్స్ - 1 తెలుగు/ తమిళ్/ కన్నడ.

    * MI Vs SRH : స్టార్ స్పోర్ట్స్ -2, స్టార్ స్పోర్ట్స్ -3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ గోల్డ్ -2

    * ఇక, హాట్ స్టార్ ఈ రెండు మ్యాచ్ లను స్ట్రీమింగ్ చేస్తోంది.

    ఇక, ఐపీఎల్ 2021(IPL 2021)లో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. మరోవైపు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించడానికి ముంబై ఇండియన్స్ 171 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఓడించాలి. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించిన అంత భారీ విజయం అసాధ్యం. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచి.. 14 పాయింట్లను సాధించినా గానీ ప్లేఆఫ్స్‌లో వెళ్లలేదు. పాయింట్లు సమానంగా ఉన్నా.. నెట్ రన్‌రేట్ విషయంలో నైట్ రైడర్స్.. ముంబై కంటే చాలా మెరుగ్గా ఉంది.

    ముంబై ఇండియన్స్ తన నెట్ రన్‌రేట్‌ను మెరుగుపరచుకోవడానికి అందుబాటులో ఉన్న ఏకైక మ్యాచ్‌ను ఆ సాయంత్రం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయంలో టాస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిస్తే- తొలుత బ్యాటింగ్ ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

    200లకు పైగా పరుగులు చేయాల్సి ఉంటుంది. తన ప్రత్యర్థిని 171 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అలా లక్ష్యాన్ని నిర్దేశించాలీ అంటే ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయడం తప్పనిసరి. ఇలా చేయగలిగితేనే నెట్ రన్‌రేట్‌‌లో నైట్ రైడర్స్‌ను అధిగమించగలుగుతుంది. టాస్ ఓడిపోయి- ఫీల్డింగ్ చేయాల్సి వస్తే.. ఆ ఛాన్స్ కూడా ఉండదు.

    కోల్ కతా గ్రాండ్ విక్టరీతో ముంబై, పంజాబ్ ఆశలు తుడిచి పెట్టుకుపోయాయ్. ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్ ప్లే ఆఫ్ రేస్ బరిలో నిలవడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ లీగ్ స్టేజిలోనే నిష్క్రమించనుండటంతో ఆ జట్టు ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. ఇక, ఆర్సీబీ టాప్ -2 లో నిలవడం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.
    Published by:Sridhar Reddy
    First published: