ఏషియాడ్: బ్రిడ్జ్ మెన్స్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం

బ్రిడ్జ్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో అనూహ్యంగా స్వర్ణం పతకం ఇండియా సొంతమైంది. బ్రిడ్జ్‌లో నెగ్గిన తొలి స్వర్ణంతో భారత ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 15కు చేరింది.

news18-telugu
Updated: September 1, 2018, 1:51 PM IST
ఏషియాడ్: బ్రిడ్జ్ మెన్స్ ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకం
బ్రిడ్స్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో బర్దన్ ప్రణబ్,శిబ్‌నాథ్ సర్కార్‌లకు స్వర్ణం (Rajyavardhan rathore/ Twitter)
  • Share this:
ఏషియాడ్‌ 14వ రోజు పోటీల్లో భారత్‌కు రెండు బంగారు పతకాలు దక్కాయి.బ్రిడ్జ్ మెన్స్ పెయిర్ ఈవెంట్‌లో అనూహ్యంగా స్వర్ణం పతకం ఇండియా సొంతమైంది.పురుషుల ఫైనల్‌లో బర్దన్ ప్రణబ్,శిబ్‌నాథ్ సర్కార్‌ పెద్ద సంచలనమే సృష్టించారు.అంచనాలకు మించి రాణించి గోల్డ్ మెడల్ సాధించారు.హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన చైనా జోడి చెన్ గాంగ్, యాన్ లిక్సిన్‌లను వెనక్కునెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచారు.మిగతా పోటీదారుల కంటే మెరుగైన ప్రదర్శనతో 384 పాయింట్లతో స్వర్ణ పతకం నెగ్గారు.ఈ ఈవెంట్‌లో చైనా జోడి చెన్ గాంగ్, యాన్ లిక్సిన్‌ 378 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచి రజత పతకంతోనే సరిపెట్టుకున్నారు.
బ్రిడ్జ్‌లో నెగ్గిన తొలి స్వర్ణంతో భారత ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 15కు చేరింది.14వ రోజు భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు రావడం విశేషం.అంతగా ప్రాచుర్యం లేని..క్రీడాభిమానులకు అసలే మాత్రం పరిచయం లేని బ్రిడ్జ్ ఈవెంట్స్‌లో భారత్‌కు మూడు పతకాలు వచ్చాయి.రెండు కాంస్య పతకాలతో పాటు,ఒక్క స్వర్ణ పతకం బ్రిడ్జ్ ఈవెంట్‌ నుంచి ఇండియా ఖాతాలో చేరాయి.పురుషుల టీమ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లతో భారత జట్లు కాంస్య పతకాలు నెగ్గాయి.


Published by: Prasanth P
First published: September 1, 2018, 1:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading