టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) తొలి గోల్డ్‌ను (First Gold) చైనాకు (China) చెందిన షూటర్ యాంగ్ జియాన్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో చైనాకు చెందిన యాంగ్ జియాన్ స్వర్ణం, రష్యాకు చెందిన అనస్తీషియా గలషీనా రజత పతకం, స్విటర్జర్లాండ్కు చెందిన నినా క్రిస్టెన్ కాంస్య పతకం సాధించారు. వరల్డ్ నెంబర్ వన్ ఎలవెనిల్ వలరివాన్, ప్రపంచ రికార్డు హోల్డర్ అపూర్వి చండీలా క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో మంచి ప్రదర్శనే చేశారు. ఎలరివరన్ క్వాలిఫయింగ్ రౌండ్లో 626.5 పాయింట్లతో టాప్ 8 పొజిషనల్లో నిలవలేక పోయింది. ఆమెకంటే రెండు పాయింట్లు ఎక్కువ సాధించిన అనస్తీషియా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించడమే కాకుండా రజత పతకాన్ని సాధించడం విశేషం.
24 July - #Shooting / Women's 10m Air Rifle
? YANG Qian??
? Anastasiia Galashina
? Nina Christen??
Congratulations to the first medalists of #Tokyo2020 #UnitedByEmotion | #StrongerTogether | @ISSF_Shooting
— #Tokyo2020 (@Tokyo2020) July 24, 2021
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో మెడల్ ఈవెంట్ ముగియడంతో భారత షూటర్లు నిరాశగా వెనుదిరిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Tokyo Olympics