పాక్ క్రికెటర్లకు శిఖర్ ధావన్ స్ట్రాంగ్ వార్నింగ్

శిఖర్ ధవన్ (ఫైల్)

పాకిస్తాన్ క్రికెటర్లకు కౌంటర్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. కాశ్మీర్ విషయంలో బయటివారి సలహాలు అవసరం లేదని అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు.

  • Share this:
    పాకిస్తాన్ క్రికెటర్లకు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. భారత్ విషయంలో పాక్ క్రికెటర్లు పదే పదే సూచనలు చేయడంతో ధావన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. పాక్ క్రికెటర్లు భారత్ అంతర్గత విషయాల్లో సలహాలు ఇవ్వడం మానేసి... వారి సొంత దేశంలో సమస్యల సంగతి చూసుకుంటే సరిపోతుందని సూచించారు. ‘ఎవరైనా మన దేశం గురించి మాట్లాడితే గట్టిగా నిలబడాలి. బయటివారి సలహాలు అవసరం లేదు. మొదట వారి దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని ఆ తర్వాత ఇతరులకు సలహాలిస్తే మంచిది. అద్దాల భవనంలో ఉండేవారు ఇతరుల మీదకు రాళ్లేయకూడదు.’ అని ధావన్ అన్నాడు. పాకిస్తాన్ క్రికెటర్లకు కౌంటర్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. కాశ్మీర్ మీద షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా కౌంటర్ ఇచ్చాడు. కాశ్మీర్ విషయంలో బయటివారి సలహాలు అవసరం లేదని అప్పట్లోనే కౌంటర్ ఇచ్చాడు.    Published by:Ashok Kumar Bonepalli
    First published: