హోమ్ /వార్తలు /క్రీడలు /

WTC Final : తొలి రోజు పోయిందని బాధపడుతున్నారా? డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఐసీసీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా?

WTC Final : తొలి రోజు పోయిందని బాధపడుతున్నారా? డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ఐసీసీ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా?

తొలి రోజు రద్దుపై గుడ్ న్యూస్ చెప్పిన ఐసీసీ

తొలి రోజు రద్దుపై గుడ్ న్యూస్ చెప్పిన ఐసీసీ

ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో ఒక రోజు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతను నాలుగు రోజుల్లో ఎలా తేలుస్తారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఐసీసీ ఏం చెబుతున్నది అంటే...

  వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) కోసం ఎంతగానో ఎదురు చూసిన అభిమానులపై వరుణుడు (Rain) నీళ్లు గుమ్మరించాడు. సమ ఉజ్జీలైన ఇండియా (India), న్యూజీలాండ్ (New Zealand) జట్లు అన్ని వ్యూహాలతో సిద్దమైనా ఒక్క బంతైనా పడకుండానే తొలి రోజు మొత్తం తుడిచి పెట్టుకొని (Washed Out)పోయింది. రెండేళ్ల నుంచి జరుగతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తుది అంకానికి వర్షం అడ్డంకిగా మారింది. కీలకమైన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఒక రోజు మొత్తం కోల్పోవడంతో ఇప్పుడు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలుతుందా లేదా అని కంగారు పడుతున్నారు. అయితే తొలి రోజు మొదటి సెషన్ రద్దు అయినట్లు ప్రకటించగానే ఆటోమెటిక్‌గా రిజర్వ్ డే అమలులోకి వచ్చినట్లు ఐసీసీ (ICC) చెబుతున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చాలా రోజుల ముందుగానే జూన్ 23ను రిజర్వ్ డే కింది ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు ఐదు రోజుల ఆటలో ఏ సెషన్ అయినా రద్దు అయినా, సమయం నష్టపోయినా దానికి రిజర్వ్ డే రోజు ఆడిస్తామని ప్రకటించింది. రాబోయే నాలుగు రోజుల్లో మ్యాచ్ ముగియక పోతే తొలి రోజు కోల్పోయిన మూడు సెషన్లను రిజర్వ్ డే రోజు అమలు చేయనున్నారు.

  టెస్టు మ్యాచ్‌లో మొత్తం 15 సెషన్లలో ఏ ఒక్క సెషన్ కోల్పోయినా దాన్ని రిజర్వ్ డే రోజు కొనసాగిస్తామని ఐసీసీ ఇది వరకే చెప్పింి. కాగా ఇప్పటికే మూడు సెషన్లు కోల్పోవడంతో రిజర్వ్ డే యాక్టివేట్ అయినట్లే అని ఐసీసీ నిబంధనలు చెబుతున్నాయి. అయితే రిజర్వ్ డే రోజు ఆడినా మ్యాచ్ ఫలితం తేలకపోతే ఇరు జట్లను విజేతలుగా ప్రకటించనున్నారు. అంతే కాకుండా రెండో రోజు ఆటను అరగంట ముందుగానే ప్రారంభించనున్నట్లు ఐసీసీ తెలిపింది. తొలి రోజు కనీసం టాస్ కూడా వేయకపోవడంతో రెండో రోజు టాస్ వేసే అవకాశం ఉన్నది. వర్షం తగ్గితే ఉదయం 10.30 బదులు 10 గంటలకే సౌతాంప్టన్‌లో మ్యాచ్ ప్రారంభం కానున్నది.

  Humanity : డెలివరీ బాయ్ కష్టాన్ని చూసి.. బైక్ కొనిచ్చిన ఫుడ్ గ్రూప్.. ది ఫాట్ క్లబ్ సభ్యుల మంచి మనసు


  ఇక వెదర్ రిపోర్ట్ చూస్తే ఈ రోజు కూడా వర్షం పడేలాగే కనిపిస్తున్నది. ఒక్క 21వ తారీఖున తప్ప మిగతా అన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెదర్ ఫోర్‌కాస్ట్ చెబుతున్నది. అదే జరిగితే అసలు మ్యాచ్ పూర్తయ్యే అవకాశమే లేదు. రెండేళ్ల పాటు సాగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరకు ఎలాంటి మ్యాచ్ లేకుండా సంయుక్త విజేతలను ప్రకటించాల్సి వస్తుంది. ఈ మ్యాచ్ కోసం స్టేడియంలో, టీవీల ముందు ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త నిజంగా నిరాశ కలిగించే అంశమే.

  Published by:John Kora
  First published:

  Tags: Cricket, ICC, India vs newzealand, WTC Final

  ఉత్తమ కథలు