హోమ్ /వార్తలు /క్రీడలు /

First Ashes Test : గబ్బాలో ఆస్ట్రేలియా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బా.. టీ-20 బ్యాటింగ్ తో హెడ్ సెంచరీ..

First Ashes Test : గబ్బాలో ఆస్ట్రేలియా దెబ్బ.. ఇంగ్లండ్ అబ్బా.. టీ-20 బ్యాటింగ్ తో హెడ్ సెంచరీ..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

First Ashes Test : గబ్బాలో ఆస్ట్రేలియా దెబ్బకి ఇంగ్లండ్ అబ్బా అంటోంది. బౌలింగ్ లో ఇంగ్లండ్ ను అల్లాండించిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు బ్యాటింగ్ లో కూడా చుక్కలు చూపుతోంది.

  యాషెస్ సిరీస్ (Ashes Series) లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ (Australia Vs England) మధ్య బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కంగారూలు పట్టు సాధిస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. హెడ్ (Travis Head) 95 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచులో అతడు టీ-20 బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేశాడు. డేవిడ్ వార్నర్ (David Warner) (94), మార్నస్ లబుషేన్ (74) లు రాణించారు. స్టీవ్ స్మిత్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (112), మిచెల్ స్టార్క్ (10) పరుగులు ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 196 పరుగుల భారీ ఆధిక్యం లో ఉంది. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లండ్ జట్టు అద్భుతం చేయాల్సిందే. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.

  గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ వార్నర్ కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు మూడు ఛాన్సులిచ్చారు. ముందుగా.. ఆసీస్ ఇన్నింగ్స్ 12 వ ఓవర్లో వార్నర్ 17 పరుగుల వద్ద ఉండగా బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ అది నోబాల్ కావడంతో వార్నర్ ఊపిరిపీల్చుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ 32 వ ఓవర్లో వార్నర్ భాయ్ 49 పరుగుల వద్ద ఉండగా.. అతడు ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్ నేలపాలు చేశాడు. అలా వార్నర్ కు రెండోసారి అదృష్టం వరించింది.

  ఇక వార్నర్ 60 పరుగుల వద్ద ఉండగా ముచ్చటగా మూడోసారి కూడా అతడిని అదృష్టం వరించింది. మార్క్ వుడ్ బౌలింగ్ లో షాట్ ఆడిన వార్నర్ సింగిల్ కు ప్రయత్నించాడు. కానీ షార్ట్ లెగ్ లో ఉన్న హసీబ్ హమీద్.. బంతిని అందుకున్నాడు. దీంతో అలర్ట్ అయిన వార్నర్.. వెనక్కి తిరిగే క్రమంలో జారిపడ్డాడు.

  ఈ సందర్భంలో బ్యాట్ కూడా జారిపోయింది. మరోవైపు బంతిని వేగంగా అందుకున్న హమీద్.. వికెట్లకు గురి చూసి కొట్టాడు. బంతి వికెట్లకు తగలడం ఖాయం అనుకున్నారంతా.. కానీ ఈసారి కూడా అదృష్టం వార్నర్ వైపే ఉంది. హమీద్ విసిరిన ఆ బంతి వికెట్ల పక్కనుంచి వెళ్లింది. ఒకవేళ ఆ బంతి వికెట్లను తాకితే వార్నర్ పని అయిపోయేదే.

  ఇది కూడా చదవండి : అప్పుడు ధోనీ చేసిన పని ఇప్పుడు కోహ్లీ చేసి ఉంటే కనీస గౌరవమైనా దక్కి ఉండేది..!

  మూడు ఛాన్సులొచ్చినా వార్నర్ సెంచరీ చేయలేకపోయాడు. ఇన్నింగ్స్ 55.2 ఓవర్లో.. వార్నర్ 94 పరుగుల వద్ద ఉండగా రాబిన్సన్ వేసిన బంతిని స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక తొలి రోజు ఇంగ్లాండ్ ను 147 పరుగులకే కట్టడి చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐదు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, David Warner, England vs Australia, Pat cummins, Steve smith

  ఉత్తమ కథలు