• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • FIND OUT MEANING BEHIND ANUSHKA SHARMA VIRAT KOHLIS DAUGHTER NAME VEMIKA KRS

Vamika: విరాట్ కోహ్లీ కూతురి పేరు వామిక.. ఆ పేరు వెనుక అర్థమేంటంటే..

Vamika: విరాట్ కోహ్లీ కూతురి పేరు వామిక.. ఆ పేరు వెనుక అర్థమేంటంటే..

Instagram images

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అతడి భార్య అనుష్క శర్మ(Anushka Sharma) తమ ముద్దుల కూతురికి వామిక (Vamika) అనే పేరు పెట్టారు. ఓ దేవతతో పాటు తమ పేర్లూ కలిసేలా ఈ పేరును ఖరారు చేశారు.  

  • Share this:
    టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. తమ ముద్దుల కూతురికి వామిక (Vamika) అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని విరుష్క ఇన్​స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తమ గారాలపట్టిని ఇద్దరూ ఆప్యాయంగా చూస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. చిన్నారి ముఖాన్ని మాత్రం చూపించలేదు. అయితే వారు తమ ముద్దుల కూతురు పేరును వెల్లడించడంతో అభిమానులు విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. అయితే వామిక అనే పేరుకు అర్థం తెలుసా..?

    వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో  సగభాగమైన పార్వతీ దేవి (దుర్గాదేవి) మరోపేరు అది. స్త్రీ, పురుష సమానత్వం ప్రతిబింబించే పేరు వామిక. అర్ధనారీశ్వర రూపంలో శివుడు కుడి వైపు ఉంటే.. ఎడమ వైపు పార్వతి దేవి ఉంటారు. ఎడమ అంటే వామ అని అర్థం. అందుకే పార్వతిని వామిక అంటారు. ఆ పేరును కూతురికి పెట్టారు విరుష్క జంట. అలాగే విరాట్​ – అనుష్క పేర్లు కలిసేలా కూడా ఈ పేరు ఉండడం విశేషం. విరాట్​లోని మొదటకి అక్షరం ‘వి’.. అనుష్క పేరులోని చివరి శబ్దం ‘క’ ఉండేలా గారాల పట్టి పేరు పెట్టారు.




    ఈ ఏడాది జనవరి 11న విరాట్​, అనుష్కకు తొలి సంతానంగా ఆడపిల్ల జన్మించిన సంగతి తెలిసిందే.
    Published by:Krishna P
    First published:

    అగ్ర కథనాలు