హోమ్ /వార్తలు /క్రీడలు /

INDvsENG: ఐదో టెస్టు రద్దు.. కోవిడ్ నేపథ్యంలో ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు రద్దు చేస్తూ నిర్ణయం

INDvsENG: ఐదో టెస్టు రద్దు.. కోవిడ్ నేపథ్యంలో ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు రద్దు చేస్తూ నిర్ణయం

ఇండియా-ఇంగ్లాండ్ 5వ టెస్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఈసీబీ (PC: ECB/Twitter)

ఇండియా-ఇంగ్లాండ్ 5వ టెస్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఈసీబీ (PC: ECB/Twitter)

INDvsENG: మాంచెస్టర్‌లో ఇవాళ ప్రారంభం కానున్న 5వ టెస్టును రద్దు చేస్తున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం బీసీసీఐ, ఈసీబీ మధ్య జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇండియా-ఇంగ్లాండ్ (India Vs England) జట్ల మధ్య మాంచెస్టర్‌లోని (Manchester) ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగాల్సిన 5వ టెస్టు (5th Test) రద్దు చేశారు. ఈ మేరకు బీసీసీఐ (BCCI), ఈసీబీ (ECB) మధ్య జరిగిన సమావేశంలోనిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నది. 'జట్టులో మరిన్ని కోవిడ్ కేసులు నమోదవుతాయనే అనుమానంతో దురదృష్టవశాత్తూ టీమ్ ఇండియా తమ జట్టును 5వ టెస్టు ఆడించడానికి సిద్దంగా లేదు. అందుకే 5వ టెస్టును రద్దు చేస్తూ ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి' అని ఈసీబీ ట్విట్టర్‌లో పేర్కొన్నది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు చివరి టెస్టు జరగాల్సి ఉంది. అయితే గురువారం టీమ్ ఇండియా అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యాడు. దీంతో ఈ రోజు మ్యాచ్ నిర్వహించాలా లేదా అనే విషయంలో సందిగ్దత నెలకొన్నది.

యోగేష్‌కు సన్నిహితంగా మెలిగిన రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మకు చేసిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో వారికి టెస్టు చేసినప్పుడు పాజిటివ్ వస్తే పరిస్థితి జఠిలం అవుతుందని భావించి మొత్తానికే టెస్టు మ్యాచ్ రద్దు చేశారు. మ్యాచ్ రద్దు చేసినందుకు ఇరు జట్ల క్రికెట్ ఫ్యాన్స్, మైదానంలో టికెట్లు కొన్న ప్రేక్షకులు, ఇతర భాగస్వామ్యులు క్షమించాలని కోరారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని ఈసీబీ పేర్కొన్నది.


పటౌడీ సిరీస్‌లో భాగంగా ఇప్పటి వరకు 4 టెస్టులు జరగ్గా.. దానిలో భారత జట్టు 2, ఇంగ్లాండ్ ఒక మ్యాచ్ గెలిచింది. చివరి టెస్టులో భారత జట్టు గెలిచినా, డ్రా చేసినా సిరీస్ టీమ్ ఇండియా వశం అవుతుంది. 2007 తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై టీమ్ ఇండియా సిరీస్ గెలవడం ఇదే తొలి సారి అవుతుంది. కాగా, ఓవల్ టెస్టుకు ముందు లండన్‌లో జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి బయోబబుల్ నిబంధనలు ఉల్లంఘించి హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు క్రికెటర్లు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాతే రవిశాస్త్రికి కోవిడ్ పాజిటివ్ తేలింది. ఆ వెంటనే భరత్ అరుణ్, ఫిజియో, అసిస్టెంట్ ఫిజియోలు పాజిటివ్‌గా తేలారు. గురువారం టీమ్ ఇండియా క్రికెటర్లకు కోవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే కొంత మంది క్రికెటర్లు ఇప్పటికిప్పుడు మైదానంలోకి వెళ్లి క్రికెట్ ఆడేందుకు సిద్దంగా లేనట్లు సమాచారం. అందుకే శుక్రవారం జరిపిన మరో సమావేశంలో ఈసీబీ, బీసీసీఐ మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.

First published:

Tags: Bcci, India vs england, Test Cricket

ఉత్తమ కథలు