హోమ్ /వార్తలు /క్రీడలు /

FIFA World Cup 2022 : మెస్సీ తడాఖా.. రేసులో నిలిచిన అర్జెంటీనా.. ఫ్రాన్స్ చేతిలో డెన్మార్క్ ఫసక్..

FIFA World Cup 2022 : మెస్సీ తడాఖా.. రేసులో నిలిచిన అర్జెంటీనా.. ఫ్రాన్స్ చేతిలో డెన్మార్క్ ఫసక్..

Photo Credit : FIFA

Photo Credit : FIFA

FIFA World Cup 2022 : మరోసారి మెస్సీ తన తడాఖా చూపించాడు. మెస్సీ అద్భుతమైన గోల్ తో పాటు..ఫెర్నాండేజ్ సూపర్ షోతో అర్జెంటీనా అదిరిపోయే విక్టరీ కొట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022 (FIFA World Cup 2022) హోరాహోరీగా సాగుతుంది. ప్రతి జట్టు కూడా ప్రి క్వార్టర్స్ కు చేరడం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక, తమ ఫస్ట్ మ్యాచులోనే సౌదీ అరేబియా చేతిలో ఖంగుతిని.. నాకౌట్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న అర్జెంటీనా రెండో మ్యాచులో తడాఖా చూపించింది. చిరకాల ప్రత్యర్థి మెక్సికోను 2-0 గోల్స్ తేడాతో చిత్తు చేసి.. నాకౌట్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది. గ్రూప్ సిలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెక్సికితో జరిగిన మ్యాచులో అర్జెంటీనా జూలు విదిల్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో సత్తా చాటింది.

ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు కూడా ఒక గోల్ కూడా చేయలేకపోయాయి. రెండు జట్ల డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో ఆటగాళ్లు గోల్ పోస్ట్ పై దాడులు చేసినా ఫలితం లేకపోయింది. అయితే, రెండో అర్ధభాగంలో అర్జెంటీనా రెచ్చిపోయింది. అటాకింగ్ గేమ్ తో మెక్సికోకు చుక్కలు చూపించింది. ముందు ఆట 64 వ నిమిషంలో లియోనల్ మెస్సీ జట్టుకు అదిరిపోయే గోల్ అందించాడు. ఆ తర్వాత ఆట 87 వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్ రెండో గోల్ చేయడంతో అర్జెంటీనా శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.

ఇక.. మెస్సీ మరోసారి ఈ గేమ్ లో అద్భుతమైన గోల్ చేశాడు. మెస్సీ రాణించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మెస్సీకి ఈ ప్రపంచకప్ లో ఇది రెండో గోల్ కావడం విశేషం. సౌదీ అరేబియాతో జరిగిన మ్యాచులో కూడా మెస్సీ ఫెనాల్టీనీ గోల్ గా మలిచిన సంగతి తెలిసిందే. ఈ విక్టరీతో ప్రిక్వార్టర్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది అర్జెంటీనా జట్టు.

ఫ్రాన్స్ అదుర్స్..

మరోవైపు.. ఈ మెగాటోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ అదరగొడుతుంది. తన జైత్రయాత్ర కంటిన్యూ చేస్తుంది. డెన్మార్క్ తో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16లోకి అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లు కూడా ఒక గోల్ కూడా చేయలేకపోయాయి. రెండు జట్ల డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉండటంతో ఆటగాళ్లు గోల్ పోస్ట్ పై దాడులు చేసినా ఫలితం లేకపోయింది.

ఇక.. రెండో అర్ధభాగంలో కూడా పోరు హోరాహోరీగా సాగింది. అయితే.. ఫ్రెంచ్ ఆటగాడు కైలియన్ ఎంబాపే రెండు గోల్స్ కొట్టి ఫ్రాన్స్ కు అద్భుత విజయాన్ని అందించాడు. ఎంబాపె 61వ, 86వ నిమిషాల్లో ఫ్రాన్స్‌కు గోల్స్‌ అందించి.. మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. న్మార్క్‌ తరఫున క్రిస్టెన్సన్‌ (68వ) గోల్‌ సాధించాడు. ఫ్రాన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది.

First published:

Tags: FIFA World Cup 2022, Foot ball, France, Lionel Messi

ఉత్తమ కథలు