FIFA World Cup 2022 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup)ను నాలుగు సార్లు గెల్చుకుంది. ఎటువంటి జట్టునైనా నిలువరించే డిఫెన్స్.. గోల్ పోస్ట్ దగ్గర అడ్డు గోడలా కెప్టెన్ న్యూర్ ఉండనే ఉన్నాడు. ఇక బంతి చిక్కితే చాలు క్షణాల్లో ప్రత్యర్థి గోల్ పోస్ట్ లోకి పంపే ఫార్వర్డ్ ప్లేయర్లు.. ఈపాటికి మీకు అర్థమయయ్యే ఉంటుంది మనం జర్మనీ (Germany) గురించి మాట్లాడుకుంటున్నామని. అయితే ఇదంతా గతం. 2014 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన తర్వాత జర్మనీ ఆట దెబ్బతింది. కీలక ప్లేయర్లు రిటైర్ అవ్వడంతో పాటు చాలా మంది మూడు పదుల వయసులో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత జర్మనీ టీంను వయో వృద్ధుల టీంగా పేర్కొనవచ్చు.
తొలి మ్యాచ్ లో జపాన్ చేతిలో ఓడిన జర్మనీ కష్టాల్లో పడింది. నాకౌట్ రేసులో ఉండాలంటే తర్వాతి జరిగే రెండు మ్యచ్ ల్లోనూ తప్పకుండా నెగ్గాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో గ్రూప్ ‘ఇ’లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధ రాత్రి దాటాక జరిగిన మ్యాచ్ లో స్పెయిన్ తో తలపడింది. స్పెయిన్ జట్టులో చాలా మంది ప్లేయర్లు 25 ఏళ్ల లోపు వారే. ఆసక్తిగా సాగిన ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించిన జర్మనీ ఊపిరి పీల్చుకుంది. 90 నిమిషాల నిర్ణీత ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు కూడా 1-1 గోల్ తో నిలిచాయి. రెండు గోల్స్ కూడా రెండో అర్ధ భాగంలోనే నమోదు కావడం విశేషం.
That’s a wrap on matchday eight. We go again tomorrow! #FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 27, 2022
తొలుత ఆట 62వ నిమిషంలో అల్బా ఇచ్చిన పాస్ ను మోరాట ఎటువంటి తప్పు చేయకుండా జర్మనీ గోల్ పోస్ట్ లోకి నెట్టి స్పెయిన్ కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గోల్స్ కోసం జర్మనీ చేసి పలు ప్రయత్నాలను స్పెయిన్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అప్పటికే 80 నిమిషాల ఆట పూర్తి కావడం.. మరో పది నిమిషాల ఆటతో పాటు అదనపు సమయం మాత్రమే మిగిలి ఉండటంతో జర్మనీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే 83వ నిమిషంలో స్పెయిన్ రక్షణ శ్రేణిని ముసియాల ఛేదించుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత సబ్ స్టిట్యూట్ ఫుల్ క్రుగ్ కు పాస్ ఇచ్చాడు. ఎటువంటి తప్పు చేయని ఫుల్ క్రుగ్ స్పెయిన్ గోల్ పోస్ట్ లోకి పంపి మ్యాచ్ ను ‘డ్రా’గా ముగించాడు. ఆ తర్వాత ఇరు జట్లు కూడా మరో గోల్ చేయడంలో విఫలం అయ్యాయి. దాంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. ప్రస్తుతం గ్రూప్ ‘ఇ’లో నాలుగు పాయింట్లతో స్పెయిన్ అగ్రస్థానంలో.. 3 పాయింట్లతో జపాన్ రెండు.. 3 పాయింట్లతో కొస్టారికా మూడు.. ఒక పాయింట్ తో జర్మనీ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ప్రిక్వార్టర్స్ కు చేరాలంటే తమ చివరి మ్యాచ్ లో జర్మనీ కొస్టారికా పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంది. ఇక ఇతర మ్యాచ్ ల్లో కొస్టారికా 1-0 గోల్ తేడాతో జపాన్ పై.. మొరాకో 2-0 గోల్స్ తో బెల్జియంపై.. క్రొయేషియా 4-1 గోల్స్ తేడాతో కెనడాపై గెలుపొందాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Germany, Qatar, Spain