FIFA World Cup 2022 : ఖతర్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022) టీం అంచనాలకు అందకుండా సాగుతుంది. ఫేవరెట్స్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా, బెల్జియం, జర్మనీ లాంటి జట్లు తమ కంటే బలహీన జట్ల చేతుల్లో ఓడాయి. ఒక్క ఫ్రాన్స్ మాత్రమే డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు ఆడుతుంది. ఇక సోమవారంతో గ్రూప్ దశ రెండో రౌండ్ లీగ్ మ్యాచ్ మ్యాచ్ లు పూర్తి కానున్నాయి. అంటే ప్రతి గ్రూప్ లో ఉన్న నాలుగు జట్లు రెండేసి మ్యాచ్ లను నేటితో ఆడేస్తాయి. ఇక చివరిదైన మూడో రౌండ్ మ్యాచ్ లు మంగళవారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో సోమవారం గ్రూప్ ‘జి‘, ‘హెచ్’లలో మ్యాచ్ లు జరగనున్నాయి.
ఇక సోమవార జరిగే మ్యాచ్ లో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో టీం పోర్చుగల్ కూడా బరిలోకి దిగనుంది. గ్రూప్ ‘హెచ్’లో భాగంగా జరిగే మ్యాచ్ లో ఉరుగ్వేతో పోర్చుగల్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధ రాత్రి గం. 12.30లకు జరగనుంది. తొలి మ్యాచ్ లో పోర్చుగల్ ఘనాపై నెగ్గిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో గోల్ వేసిన రొనాల్డో 2006 నుంచి ఆడిన ఐదు వరుస ప్రపంచకప్ లలో కనీసం ఒక్క గోల్ చేసిన తొలి పురుషు ఫుట్ బాల్ ప్లేయర్ గా నిలిచాడు. బలాబలాలను చూస్తే ఉరుగ్వే, పోర్చుగల్ రెండు జట్లు సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ లో పోర్చుగల్ నెగ్గితే ప్రిక్వార్టర్స్ కు చేరుకుంటుంది. లేదంటే చివరి మ్యాచ్ వరకు ఎదురు చూడాల్సి వస్తుంది.
Hitchhiking from Lisbon to Doha ???? These Portuguese fans doing whatever it takes ???????? #FIFAWorldCup #Qatar2022 pic.twitter.com/51qeHCDkSL
— FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022
5 సార్లు ఫుట్ బాల్ ప్రపంచకప్ విజేత బ్రెజిల్ కూడా సోమవారం బరిలోకి దిగనుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9.30 గంటలకు జరిగే గ్రూప్ ’జి’ మ్యాచ్ లో స్విట్జర్లాండ్ తో బ్రెజిల్ తలపడనుంది. సెర్బియాతో జరిగిన మ్యాచ్ లో బ్రెజిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే స్విట్జర్లాండ్ కు ముందు బ్రెజిల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సెర్బియాతో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ నేమార్ జూనియర్ బ్రెజిల్ ఆడే తర్వాతి గ్రూప్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. దాంతో స్విట్జర్లాండ్ తో పాటు కెమరూన్ తో జరిగే మ్యాచ్ ల్లో నేమార్ జూనియర్ ఆడేది లేదు. గ్రూప్ ‘జి‘లో భాగంగా జరిగే మరో మ్యాచ్ లో సెర్బియాతో కెమరూన్ తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం గం. 3.30లకు ఆరంభం కానుంది. గ్రప్ ‘హెచ్’లో జరిగే మ్యాచ్ లో సౌత్ కొరియాతో ఘనా ఆడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం గం. 6.30లకు జరగనుంది.
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నేడు
సెర్బియా X కెమరూన్ (మ.గం. 3.30లకు)
సౌత్ కొరియా X ఘనా (సా.గం. 6.30లకు)
బ్రెజిల్ X స్విట్జర్లాండ్ (రా.గం.9.30లకు)
పోర్చుగల్ X ఉరుగ్వే (అర్ధారాత్రి గం. 12.30లకు)
ఈ మ్యాచ్ లను స్పోర్ట్స్ 18, జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022, Lionel Messi, Switzerland