FIFA World Cup 2022 : అభిమానుల ఆగ్రహం కట్టలు తెగింది. ప్రస్తుతం జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో తమ జట్టు ఓడిపోవడాన్ని సహించలేకపోయిన ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ప్రస్తుతం ఖతర్ (Qatar) వేదికగా ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ప్రపంచ రెండో ర్యాంక్ జట్టు బెల్జియం (Belgium) చిత్తు చిత్తుగా ఓడిపోయింది. అది కూడా తన కంటే బలహీనమైన మొరాకో చేతిలో. దాంతో ఓటమిని అవమానంగా భావించిన బెల్జియం అభిమానులు తమ దేశ రాజధాని బ్రస్సెల్స్ లో అల్లర్లకు పాల్పడ్డారు. వీధుల్లోకి వచ్చి కనిపించిన ప్రతి వాహనాన్ని ధ్వంసం చేశారు. కొన్నిటికి నిప్పు కూడా పెట్టారు.
వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొరాకో చేతిలో ఓడిపోవడాన్ని బెల్జియం ఫుట్ బాల్ జట్టు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఫిఫా ర్యాంకింగ్స్ లో బెల్జియం ప్రస్తుతం రెండో ర్యాంక్ లో ఉంది. ఇక మొరాకో 22వ ర్యాంక్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో బెల్జియం ప్రిక్వార్టర్ ఫైనల్స్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. ప్రిక్వార్టర్స్ కు చేరాలంటే తన తర్వాతి పోరులో క్రొయేషియాపై బెల్జియం తప్పుకుండా నెగ్గాల్సి ఉంటుంది. వీధుల్లో అల్లర్లకు పాల్పడ్డ అభిమానులను పోలీసులు నీటితో చెదరగొట్టారు.
❗️Footage from #Belgium, where football fans smashed the center today. Belgium football fans are very disappointed with the defeat of the national team against #Morocco football team pic.twitter.com/4qeK8XAs59
— OsintTv???? (@OsintTv) November 27, 2022
After Morocco won against Belgium 2-0 at the World Cup, riots erupted in the heart of Brussels and several other Belgian cities. ????#FIFAWorldCup #BELMAR #WorldCupwithMOLAT pic.twitter.com/LUrvemtWb4
— Ⓜ️????️.. ..Molatsportgist ???????? (@chubbyMO_) November 28, 2022
గ్రూప్ ‘ఎఫ్’లో భాగంగా జరిగిన పోరులో మొరాకో 2-0 గోల్స్ తేడాతో బెల్జియంపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బెల్జియం తరఫున సబీర్ (73వ నిమిషంలో), అబౌఖలాల్ (90+2వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఈ విజయంతో నాలుగు పాయింట్లు సాధించిన మొరాకో గ్రూప్ ‘ఎఫ్’లో టాప్ ప్లేస్ కు చేరుకుంది.
ఆట ఆరంభం నుంచే మొరాకో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతి ఎక్కువ భాగం తమ నియంత్రణలో ఉంచుకోకపోయినా తమకు దొరికిన ప్రతి అవకాశాన్ని గోల్ చేసేలా కనిపించింది. ఈ క్రమంలో తొలి అర్ధ భాగంలో మొరాకో గోల్ చేసింది. అయితే ఆఫ్ సైడ్ కారణంగా రిఫరీ ఆ గోల్ ను రద్దు చేశాడు. దాంతో తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే ముగిసింది. ఇక రెండో అర్ధ భాగంలో మొరాకో మరింత వేగంగా ఆడింది. ఇక బెల్జియం పూర్తిగా డిఫెన్స్ కే ప్రధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో 73వ నిమిషంలో మొరాకోకు ఫ్రీ కిక్ లభించింది. లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి సబీర్ కళ్లు చెదిరే కిక్ తో బెల్జియం గోల్ పోస్ట్ లోకి పంపి మొరాకోకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇంజూరీ సమయంలో మరో గోల్ చేసిన మొరాకో తిరుగులేని విజయాన్ని అందుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Qatar