ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) హోరాహోరీగా సాగుతుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే చాలా సంచలనాలు నమోదు అయ్యాయి. ఇప్పుడు నాకౌట్ దశలో అసలు సిసలైన సంచలనం నమోదైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్పెయిన్.. షూటౌట్లో ఘోరంగా తడబడి ఇంటిముఖం పట్టింది. మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో మొరాకో 0-0 (3-0)తో స్పెయిన్‌ను ఓడించింది. మ్యాచ్ అదనపు సమయం వరకు సాగినా.. ఇరుజట్లూ గోల్ చేయలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. మొరాకో ఆటగాళ్లు నాలుగు కిక్ల్లో మూడు గోల్స్ చేశారు. కాగా, స్పెయిన్ మూడు కిక్ల్లో మొదటి కిక్ గోల్ పోస్టుకు తగిలి బయటకు వెళ్లగా.. రెండు కిక్‌లను బోనో అడ్డుకొని మొరాకో హీరోగా నిలిచాడు.
కేవలం ఆరోసారి మాత్రమే ప్రపంచకప్ ఆడుతూ, ఎప్పుడో 36 ఏళ్ల కిందట ఒకసారి నాకౌట్ ఆడిన చరిత్ర ఉన్న మొరాకో.. మంగళవారం అంచనాలకు అందని ఆటతో స్పెయిన్‌కు కళ్లెం వేసింది. 120 నిమిషాల పాటు స్పెయిన్‌ను గోల్ చేయనివ్వకుండా అడ్డుకోవడమే కాక.. పెనాల్టీ షూటౌట్లో 3-0తో ఆ జట్టును ఓడించి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
???????????????????????????? ???????????????????????? ????
Morocco reach the Quarter-Finals for the first time. ???????? #FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/Z6uVjyLmWz — FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022
స్పెయిన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా.. మొరాకో దీటుగానే స్పందించింది. ఎప్పటిలాగే బంతిపై స్పెయిన్ ఆధిపత్యం చెలాయించినా.. గోల్ పోస్టుపై కచ్చితమైన దాడులు చేయలేక పోయింది. ఫస్టాఫ్ 10వ నిమిషంలో బౌఫాల్ను కిందపడేయడంతో మొరాకోకు రెఫరీ ఫ్రీకిక్ ఇచ్చాడు. కానీ, హకీమ్ జియేషి కొట్టిన కిక్.. క్రాస్ బార్ పైనుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత మొరాకో ఎదురుదాడి చేస్తూ స్పెయిన్ డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో 21వ నిమిషంలో బౌఫాల్ మంచి అవకాశాన్ని సృష్టించినా.. మొరాకో గోల్‌గా మలచలేక పోయింది. మరో నాలుగు నిమిషాల తర్వాత స్పెయిన్ ఆటగాడు గవి కొట్టిన కిక్.. గోల్ పోస్టును తాకి రీబౌండ్ అయింది.
42వ నిమిషంలో బౌఫాల్.. స్పెయిన్ పెనాల్టీ ఏరియాలోకి చక్కని క్రాస్ కొట్టినా.. అగ్యూర్డ్ కొట్టిన హెడర్ బార్ పైనుంచి బయటకు పోయింది. దీంతో ఫస్టాఫ్ 0-0తో గోల్ లెస్‌గా ముగిసింది. ఇక, సెకండా్‌ఫలో ఇరుజట్లూ దూకుడుగా ఆడాయి. ఈ క్రమంలో 53వ నిమిషంలో మొరాకో పెనాల్టీ ఏరియాలోకి చొచ్చుకెళ్తున్న ఓల్మోను అడ్డుకొనే ప్రయత్నంలో హకీమి ఫౌల్ చేయడంతో.. స్పెయిన్‌కు ఫ్రీకిక్ లభించింది. అయితే, ఈ కిక్‌ను మొరాకో కీపర్ చాకచక్యంగా బయటకు నెట్టేశాడు.
ఆ తర్వాత ఇరుజట్లూ గోల్ కోసం ప్రయత్నించినా.. ఫినిషింగ్ లోపంతో నిరాశ పరిచాయి. 81వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ కొట్టిన షాట్.. గోల్‌కు దగ్గర నుంచి పక్కకు పోయింది. ఆఖరి రెండు నిమిషాల్లో స్పెయిన్‌కు గోల్ చేసే అవకాశం దక్కినా.. మొరాటో కొట్టిన హెడర్ బయటకు పోవడంతో మ్యాచ్ ఫలితం అదనపు సమయానికి మళ్లింది. కానీ, ఎక్స్ట్రా టైమ్‌లోనూ గోల్ నమోదు కాకపోవడంతో.. పెనాల్టీ షూటౌట్ తప్పలేదు.
THE HERO ???????????? pic.twitter.com/WCaCZEmHqh
— FIFA World Cup (@FIFAWorldCup) December 6, 2022
అయితే షూటౌట్లలో స్పెయిన్‌కు సరైన రికార్డు లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన తప్పలేదు. ఆ జట్టు ఆటగాళ్లలోనూ అది ప్రతిఫలించింది. సబిరి సునాయాసంగా గోల్ కొట్టి మొరాకోను 1-0 ఆధిక్యంలో నిలపగా.. పాబ్లో సరాబియా షాట్ గోల్ బార్‌ను తాకడంతో స్పెయిన్‌కు ఆరంభంలోనే నిరాశ తప్పలేదు. హకీమ్ జియెచ్ నెట్ మధ్యలోకి షాట్ ఆడిన షాట్‌తో మొరాకో 2-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. కార్లోస్ సోలెర్ షాట్‌ను యాసిన్ సరిగ్గా అంచనా వేసి ఆపేయడంతో స్పెయిన్‌కు మళ్లీ షాక్ తగిలింది.
బెనౌన్ షాట్‌ను సైమన్ ఆపడంతో స్పెయిన్ ఆశలు నిలిచాయి. కానీ ఆ జట్టు కెప్టెన్ సెర్జియో కొట్టిన షాట్‌ను కుడివైపు దూకుతూ యాసిన్ ఆపేయడంతో మొరాకో విజయానికి చేరువ అయింది. తమ జట్టు నాలుగో ప్రయత్నాన్ని విజయవంతం చేస్తూ హకిమి గోల్ కొట్టడంతో మొరాకో సంబరాలకు అంతే లేకుండా పోయింది. స్పెయిన్ శిబిరం కాసేపటికే కన్నీళ్లతో నిండిపోయింది. వరల్డ్ కప్‌లో స్పెయిన్ పెనాల్టీ షూటౌట్లో ఓడడం ఇది నాలుగోసారి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: FIFA, FIFA World Cup 2022, Football