ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) హోరాహోరీగా సాగుతుంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటికే చాలా సంచలనాలు నమోదు అయ్యాయి. అర్జెంటీనా లాంటి మేటి జట్టును సౌదీ అరేబియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ దశ ఆఖర్లో పసికూన అయిన ట్యునీసియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను చిత్తు చేసింది. ఇప్పుడు మరో సంచలనం నమోదైంది. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆసియా జట్టు దక్షిణ కొరియా దుమ్మురేపింది. తమ కంటే ఎంతో బలమైన పోర్చుగల్ ను చిత్తు చేసి సగ్వరంగా రౌండ్ ఆఫ్ -16 లోకి అడుగుపెట్టింది. ఈ విక్టరీతో ఉరుగ్వే జట్టు ఆశలు అడియాసలయ్యాయి. దక్షిణ కొరియా విక్టరీతో ఉరుగ్వే ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.
గ్రూప్-హెచ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కొరియా 2-1 పోర్చుగల్‌పై అనూహ్య విజయం సాధించింది. ఆట చివరి నిమిషాల్లో అదృష్టం కలిసిరావడంతో.. వాంగ్ హి చాన్ సూపర్ గోల్‌తో దక్షిణ కొరియా రౌండ్-16కు దూసుకెళ్లింది. ఈ మ్యాచులో పూర్తి ఆధిపత్యం పోర్చుగల్ జట్టుదే. కానీ.. కీలక సమయాల్లో దుమ్మురేపిన సౌత్ కొరియాకు విజయం వరించింది. ఫస్టాఫ్ లో పోర్చుగల్ ఆటగాడు రికార్డో హోర్టా ఐదో నిమిషంలో గోల్ చేసి ఆ జట్టుకు ఆధిక్యాన్ని ఇచ్చాడు.
Never. Stop. Believing. ????????#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022
అయితే.. ఈ ఆధిక్యం ఎంతో సేపు నిలవలేదు. 27వ నిమిషంలో సౌత్ కొరియా ఆటగాడు కిమ్ యంగ్ జివోన్ గోల్ కొట్టి స్కోరును 1-1 తో సమం చేశాడు. 27వ నిమిషంలో కార్నర్ కిక్‌ను పోర్చుగల్ క్లియర్ చేయలేక పోవడంతో.. అక్కడే పొంచి ఉన్న కిమ్ యంగ్ పవర్ఫుల్ షాట్‌తో గోల్‌లోకి పంపి స్కోరు సమం చేశాడు. అయితే.. సెకండాఫ్ లో రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. గోల్ పోస్టులపై వరుస పెట్టి దాడులు చేశాయి.
అయితే.. ఇరు జట్ల రక్షణ శ్రేణి పటిష్టంగా ఉండటంతో సెకండాఫ్‌లో ఇరుజట్లూ గోల్ ప్రయత్నాలు చేసినా సఫలం కాలేక పోయాయి. ఇక ఇంటికే అనుకున్న కొరియా హీరోగా నిలిచాడు హి చాన్. స్టాపేజ్ టైమ్ (90+1)లో పాస్‌ను అందుకొన్న సన్ హువాంగ్ మిన్ మెరుపు వేగంతో పోర్చుగల్ గోల్‌వైపు కదిలాడు. డిఫెండర్లు అడ్డుతగిలినా బంతిని తన ఆధీనంలో ఉంచుకొన్న సన్.. పెనాల్టీ ఏరియాలోకి చొచ్చుకొచ్చిన చాన్ కు పాస్ చేయడం.. అతడు కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతి నేరుగా నెట్లోకి పంపాడు.
When the situation demanded, Hwang Hee-Chan delivered ???? His finish in the 90th minute was the deciding factor in being named your @Budweiser Player of the Match ???? ???????? #KORPOR ???????? #POTM #YoursToTake #BringHomeTheBud pic.twitter.com/8zW6RxsB5n
— FIFA World Cup (@FIFAWorldCup) December 2, 2022
ఇక ఇంటికే అనుకున్న కొరియాను తర్వాతి రౌండ్‌కు చేర్చి హీరో అయ్యాడు.పోర్చుగల్ ముందుగానే ప్రీకార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. ఈ మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టుపై ఎటువంటి ప్రభావం చూపలేదు. కొరియా నాకౌట్‌కు చేరడం ఇది మూడోసారి. 2002లో సెమీస్ చేరిన కొరియా.. 2010లో రౌండ్-16కు అర్హత సాధించింది.
గెలిచినా ఉరుగ్వే ఇంటికి..
రెండు సార్లు ఛాంపియన్ ఉరుగ్వేకు నిరాశ ఎదురైంది. తమ చివరి లీగ్ మ్యాచులో ఘనాపై 2-0 గోల్స్ తో అద్బుతం విజయం సాధించినా ఫలితం లేకపోయింది. పాయింట్ల టేబుల్ మూడో స్థానంలో నిలవడంతో ఇంటి దారి పట్టింది రెండు సార్లు ఛాంపియన్. ఘనాతో మ్యాచులో డి అరస్కేటా 26, 32 నిమిషాల్లో గోల్ కొట్టి తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు. ఇదే ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న ఉరుగ్వే గెలుపుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022, Football