FIFA World Cup 2022 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022) 2022లో గోల్స్ వర్షం కురిసింది. గ్రూప్ ‘జి’లో భాగంగా సెర్బియా (Serbia), కెమెరూన్ (Cameroon) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 3-3 గోల్స్ తేడాతో ‘డ్రా’గా ముగిసింది. ఆఖరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన మ్యాచ్ చివరకు డ్రాగా ముగియడం విశేషం. కెమెరూన్ తరఫున క్యాస్టెలెటో (29వ నిమిషంలో), అబుబకర్ (63వ నిమిషంలో), చౌపో మోటింగ్ (66వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఇక సెర్బియా తరఫున పావ్లోవిచ్ (45+1వ నిమిషంలో), మిలిన్కోవిచ్ (45+3వ నిమిషంలో), మిత్రోవిచ్ (53వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరింది. ప్రస్తుతం గ్రూప్ ‘జి’లో బ్రెజిల్ 3 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. రెండు పాయింట్లతో కెమెరూన్ రెండు.. చెరో పాయింట్ తో స్విట్జర్లాండ్, సెర్బియా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఆట ఆరంభం నుంచే గోల్ కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. ఆట 29 నిమిషంలో అద్భుతమైన టచ్ తో క్యాస్టెల్లెటో గోల్ చేసి కెమెరూన్ కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత సెర్బియా గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే తొలి అర్ధ భాగం అదనపు సమయంలో సెర్బియా రెచ్చిపోయింది. తొలి అర్ధ భాగంలో రిఫరీ 6 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించాడు. ఈ క్రమంలో రెండు నిమిషాల వ్యవధిలో సెర్బియా రెండు గోల్స్ చేసి కెమరూన్ ను షాక్ కు గురి చేసింది. ఇక రెండో అర్ధ భాగంలో మరో గోల్ చేసి 3-1తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ స్థితిలో సెర్బియా సులభంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా పుంజుకున్న కెమెరూన్ రెండు నిమిషాల్లో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. చివర్లో ఇరు జట్లు కూడా గోల్ కోసం ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు.
The points are shared after a thrilling game!@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నేడు
సౌత్ కొరియా X ఘనా (సా.గం. 6.30లకు)
బ్రెజిల్ X స్విట్జర్లాండ్ (రా.గం.9.30లకు)
పోర్చుగల్ X ఉరుగ్వే (అర్ధారాత్రి గం. 12.30లకు)
ఈ మ్యాచ్ లను స్పోర్ట్స్ 18, జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, FIFA, FIFA World Cup 2022, Qatar, Serbia, South korea