హోమ్ /వార్తలు /క్రీడలు /

FIFA World Cup 2022 : కరోనా నెగెటివ్ ఉంటేనే అనుమతి.. ఫుట్ బాల్ ఫ్యాన్స్ పై బాంబు పేల్చిన ఖతర్

FIFA World Cup 2022 : కరోనా నెగెటివ్ ఉంటేనే అనుమతి.. ఫుట్ బాల్ ఫ్యాన్స్ పై బాంబు పేల్చిన ఖతర్

ఫుట్ బాల్ ప్రపంచకప్ ట్రోఫీ (PC: FIFA)

ఫుట్ బాల్ ప్రపంచకప్ ట్రోఫీ (PC: FIFA)

FIFA World Cup 2022 : ఫిఫా (FIFA) ఫుట్ బాల్ ప్రపంచకప్ (World Cup) ఈ ఏడాది నవంబర్ లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఖతర్ (Qatar) వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫుట్ బాల్ ప్రపంచకప్ జరగనుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

FIFA World Cup 2022 : ఫిఫా (FIFA) ఫుట్ బాల్ ప్రపంచకప్ (World Cup) ఈ ఏడాది నవంబర్ లో ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఖతర్ (Qatar) వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఫుట్ బాల్ ప్రపంచకప్ జరగనుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఫుట్ బాల్ ప్రపంచకప్ జరిగే సమయంలో ఖతర్ కు ఫుట్ బాల్ ఫ్యాన్స్ పోటెత్తే అవకాశం ఉంది. ఇక ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు ఖతర్ ప్రభుత్వం ఒక చేదు వార్తను తెలియజేసింది. ప్రపంచకప్ కోసం ఇతర దేశాల నుంచి ఖతర్ కు వచ్చే ఫుట్ బాల్ ఫ్యాన్స్ కరోనా పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని సూచించింది. వారు వారి దేశం నుంచి బయలుదేరడానికి 48 గంటలు ముందుగా ( పీసీఆర్ టెస్టు అయితే).. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు అయితే 24 గంటలు ముందుగా చేయించుకోల్సి ఉంటుందని పేర్కొంది.

అంతేకాకుండా ఆ టెస్టుల్లో నెగెటివ్ అని రిపోర్టు వస్తేనే తమ దేశానికి బయలుదేరి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 6 సంవత్సరాలు పై బడిని ప్రతి ఒక్కరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందేనన తేల్చి చెప్పింది. ఇక ప్రజా రవాణాలో ప్రయాణం చేసేటప్పుడు, బహిరంగ  ప్రదేశాల్లో మాస్క్ లను కూడా తప్పనిసరి చేసింది. ఖతర్ లో కరోనా బారిన పడితే ప్రభుత్వం కరోనా విషయంలో పాటించే నియమాలను పాటించాలంటూ పేర్కొంది. ఖతర్ జనాభా 28 లక్షలు కాగా.. అందులో కేవలం 3.8 లక్షల మంది మాత్రమే ఖతార్ ప్రజలు. మిగిలిన వారు ఇతర దేశాల నుంచి అక్కడికి వలస వెళ్లినవారే. ఇక ఖతర్ లో 4.4 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 692 మంది మరణించారు.

ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఇదే చివరి ప్రపంచకప్ 

పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో పాటు అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఇదే ఆఖరి ప్రపంచకప్ కానుంది. ఇప్పటికే వీరిద్దరు తమ కెరీర్స్ లో చివరి దశలో ఉన్నారు. దాంతో ఈసారి తమ జట్టును ప్రపంచకప్ చాంపియన్ గా నిలపాలనే పట్టుదలతో ఉన్నారు. ఈసారి కూడా 2006 చాంపియన్, 2020 యూరో కప్ చాంపియన్ ఇటలీ క్వాలిఫై కాలేకపోయింది. ప్రపంచకప్ కు అర్హత సాధించకపోవడం ఇటలీకిది వరుసగా రెండో సారి కావడం విశేషం. 2018లో కూడా ఇటలీ విశ్వ సంగ్రామానికి అర్హత సాధించలేకపోయింది. నార్త్ మెసడోనియాపై గెలుపొందడంతో క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ కూడా ప్రపంచకప్ కు క్వాలిఫై అయ్యింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022, Football, Lionel Messi, Qatar

ఉత్తమ కథలు