FIFA World Cup 2022 : ఖతర్ (Qatar) వేదికగా జరుగుతోన్న ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA Football World Cup) 2022 ఆసక్తికరంగా సాగుతుంది. లీగ్ దశలో సోమవారం నాటికి రెండు రౌండ్లు పూర్తయ్యాయి. అంటే ఎనిమిది గ్రూపుల్లోని 32 జట్లు కూడా రెండేసి మ్యాచ్ లను ఆడేశాయి. ఫ్రాన్స్ (France) ప్రిక్వార్టర్స్ కు చేరుకోగా.. సోమవారం విజయాలు నమోదు చేసిన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) టీం పోర్చుగల్ (Portugal)తో పాటు టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్ (Brazil) కూడా ప్రిక్వార్టర్స్ కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధ రాత్రి దాటాక ముగిసిన మ్యాచ్ లో పోర్చుగల్ 2-0 గోల్స్ తేడాతో ఉరుగ్వేపై ఘనవిజయం నమోదు చేసింది. దాంతో గ్రూప్ ‘హెచ్’లో 6 పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రిక్వార్టర్స్ కు అర్హత సాధించింది.
ఉరుగ్వేతో జరిగిన ఈ మ్యాచ్ లో ఆరంభం నుంచే పోర్చుగల్ ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిని ఎక్కువ సేపు తన ఆధీనంలోనే ఉంచుకుంటూ ఉరుగ్వేకు చుక్కలు చూపించింది. అయినప్పటికీ ఉరుగ్వే పలుమార్లు గోల్ చేసేలా కనిపించింది. అయితే పోర్చుగల్ గోల్ కీపర్ డియాగో కోస్టా వాటిని అడ్డుకున్నాడు. ఇక ఆట రెండో అర్ధ భాగంలో బ్రూనో ఫెర్నాండెస్ (54వ నిమిషంలో) అద్భుత కిక్ తో నేరుగా ఉరుగ్వే గోల్ పోస్ట్ లోకి పంపి పోర్చుగల్ కు ఆధిక్యాన్ని ఇచ్చాడు. అదనపు సమయంలో లభించిన పెనాల్టీని మరోసారి గోల్ గా మలిచిన ఫెర్నాండెస్ పోర్చుగల్ ను ప్రిక్వార్టర్స్ కు చేర్చాడు.
Two from Bruno Fernandes sends ???????? @selecaoportugal to the Round of 16.@adidasfootball | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022
అంతకుముందు జరిగిన మరో గ్రూప్ ‘జి’ మ్యాచ్ లో బ్రెజిల్ 1-0 గోల్ తేడాతో స్విట్జర్లాండ్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే మరో ఏడు నిమిషాల్ల ో ఆట ముగుస్తుందన్న తరుణంలో బ్రెజిల్ ప్లేయర్ కెసెమిరో (83వ నిమిషంలో) గోల్ చేసి బ్రెజిల్ ను ప్రిక్వార్టర్స్ కు చేర్చాడు. గ్రూప్ ‘హెచ్’లో ఉత్కంఠ భరితంగా సాగిన మరో మ్యాచ్ లో ఘనా 3-2 గోల్స్ తేడాతో సౌత్ కొరియాపై నెగ్గింది.
గ్రూప్ ‘జి’లో భాగంగా సెర్బియా, కెమెరూన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 3-3 గోల్స్ తేడాతో ‘డ్రా’గా ముగిసింది. ఆఖరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన మ్యాచ్ చివరకు డ్రాగా ముగియడం విశేషం. కెమెరూన్ తరఫున క్యాస్టెలెటో (29వ నిమిషంలో), అబుబకర్ (63వ నిమిషంలో), చౌపో మోటింగ్ (66వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఇక సెర్బియా తరఫున పావ్లోవిచ్ (45+1వ నిమిషంలో), మిలిన్కోవిచ్ (45+3వ నిమిషంలో), మిత్రోవిచ్ (53వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. ఇక ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరింది. ప్రస్తుతం గ్రూప్ ‘జి’లో బ్రెజిల్ 3 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. రెండు పాయింట్లతో కెమెరూన్ రెండు.. చెరో పాయింట్ తో స్విట్జర్లాండ్, సెర్బియా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022