హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2022 : ఒక ప్రపంచకప్ ముగిసింది.. మరో ప్రపంచకప్ కు తెర లేవనుంది.. ఇందులో ఏకంగా 32 జట్లు

T20 World Cup 2022 : ఒక ప్రపంచకప్ ముగిసింది.. మరో ప్రపంచకప్ కు తెర లేవనుంది.. ఇందులో ఏకంగా 32 జట్లు

PC : FIFA

PC : FIFA

T20 World Cup 2022 : అక్టోబర్ (October) 16 నుంచి ఆరంభమైన టి20 ప్రపంచకప్ (T20 World cup)కు నవంబర్ 13న జరిగే ఫైనల్ తో తెర పడనుంది. మెల్ బోర్న్ (Melbourne) వేదికగా జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ (England), పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

T20 World Cup 2022 : అక్టోబర్ (October) 16 నుంచి ఆరంభమైన టి20 ప్రపంచకప్ (T20 World cup)కు నవంబర్ 13న జరిగే ఫైనల్ తో తెర పడనుంది. మెల్ బోర్న్ (Melbourne) వేదికగా జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ (England), పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ ప్రపంచకప్ ముగిసిన వారం రోజులకే మరో మహా సంగ్రామానికి తెర లేవనుంది. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గేమ్ ఫుట్ బాల్. ఖతర్ వేదికగా నవంబర్ 20న ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (Fifa World Cup 2022) ఆరంభం కానుంది. డిసెంబర్ 18 వరకు ఈ టోర్నీ జరగనుంది. క్రికెట్ ప్రపంచకప్ లో కేవలం 16 జట్లు మాత్రమే పాల్గొంటే.. ఫుట్ బాల్ విశ్వ సంగ్రామంలో అందుకు రెట్టింపు అంటే 32 జట్లు తలపడనున్నాయి.

ఫుట్ బాల్ చరిత్రలోనే తొలిసారిగా ఖతర్ ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనుంది. నవంబర్ 20న జరిగే తొలి మ్యాచ్ లో ఈక్వెడార్ తో ఆతిథ్య ఖతర్ జట్టు తలపడనుంది. ఫుట్ బాల్ ప్రపంచకప్ లో ఆడటం ఖతర్ కు ఇదే తొలిసారి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ ప్రపంచకప్ కు అర్హత సాధించింది. ఈ ప్రపంచకప్ కోసం మొత్తంగా 7 అత్యాధునిక స్టేడియాలను ఖతర్ నిర్మించింది. మొత్తం 32 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. గతేడాది యూరో కప్ చాంపియన్ గా నిలిచిన ఇటలీ ఈ ప్రపంచకప్ కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం.

మెస్సీ, రొనాల్డోలకు చివరి ప్రపంచకప్

కెరీర్ చరమాంకంలో ఉన్న పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డోతో పాటు అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు రిటైర్మెంట్ కు చాలా దగ్గరగా ఉన్నారు. దాంతో వీరు తమ చివరి ప్రపంచకప్ లో అద్భుతంగా ఆడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ గా ఫ్రాన్స్ బరిలోకి దిగనుంది. అయితే ఈసారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా బ్రెజిల్ బరిలోకి దిగనుంది. బ్రెజిల్ తో పాటు ఇంగ్లండ్, స్పెయిన్, అర్జెంటీనాలు కూడా టైటిల్ ఫేవరెట్స్ లో ఉన్నాయి.

మ్యాచ్ సమయాలు.. లైవ్ ఎక్కడ చూడాలి?

నవంబర్ 20న జరిగే ఆరంభ పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ఆరంభం కానుంది. ఆ తర్వాతి రోజు నుంచి రోజుకు మూడు, నాలుగు మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 3.30లకు ఒక మ్యాచ్.. సాయంత్రం గం. 6.30లకు రెండో మ్యాచ్.. రాత్రి గం. 9.30లకు మూడో మ్యాచ్.. అర్ధ రాత్రి గం. 12.30లకు నాలుగో మ్యాచ్ జరుగుతాయి. ఫైనల్ డిసెంబర్ 18న జరగనుంది. ఈ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదే సమయంలో వూట్ (Voot) యాప్ డిజిటల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

First published:

Tags: Cristiano Ronaldo, FIFA World Cup 2022, Foot ball, Football, Lionel Messi, Qatar

ఉత్తమ కథలు