FIFA World Cup 2022 : ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA World Cup 2022) 2022లో సంచలన ప్రదర్శనలు నమోదు అవుతూనే ఉన్నాయి. అర్జెంటీనా (Argentina)పై సౌదీ అరేబియా (Saudi Arabia).. జర్మనీ (Germany)పై జపాన్ (Japan) జట్లు గెలిచి సంచలనాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా (Australia) ఫుట్ బాల్ జట్టు కూడా మరో సంచలన ప్రదర్శన చేసింది. తన కంటే బలమైన మెరుగైన జట్టు అయిన ట్యునీషియా (Tunisia)పై నెగ్గింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 1-0 గోల్ తేడాతో ట్యునీషియాపై నెగ్గింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన తమ తొలి పోరులో ఆస్ట్రేలియా.. ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. అయితే తాజా గెలుపుతో గ్రూప్ ‘డి’లో ఆస్ట్రేలియా 3 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.
ఆట ఆరంభంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు దూకుడు ప్రదర్శించారు. ఫ్రాన్స్ పై ఆరంభంలోనే గోల్ చేసినట్లే ఇక్కడ కూడా గోల్ సాధించారు. 23వ నిమషంలో లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి గూడ్ విన్ ఇచ్చిన పాస్ ను హెడర్ తో గోల్ పోస్ట్ లోకి పంపిన మిచెల్ డ్యూక్ ఆస్ట్రేలియాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇరు జట్లు కూడా గోల్ కోసం పలు మార్లు విఫలం యత్నం చేశాయి. దాంతో తొలి అర్ధ భాగం 1-0తో ముగిసింది.
Australia secure the three points! ????@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) November 26, 2022
What it means to the @Socceroos ????????#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/MopX4kK8JM
— FIFA World Cup (@FIFAWorldCup) November 26, 2022
ఇక రెండో అర్ధ భాగంలో ట్యునీషియా దూకుడుగా ఆడింది. పదే పదే ఆస్ట్రేలియా డి బాక్స్ లోకి చొచ్చుకు వచ్చి గోల్ కోసం ప్రయత్నాలు చేసింది. అయితే ఆసీస్ దుర్భేద్యమైన డిఫెన్స్ ట్యునీషియా గోల్ చేసే అవకాశాలను అడ్డుకుంది. ఇక చివరి 10 నిమిషాల్లో అయితే ట్యునీషియా అటాకింగ్ ఆటతో ఆడింది. అదే సమయంలో ఆస్ట్రేలియా పూర్తి డిఫెన్స్ కే ప్రాధాన్యం ఇచ్చింది. ట్యునీషియాకు కొన్ని సార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా ఆసీస్ గోల్ కీపర్ వాటిని అడ్డుకున్నాడు.
అర్జెంటీనాకు చావోరేవో
ఇక ఈరోజు మరో మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు ఆరంభమయ్యే గ్రూప్ ‘సి’ మ్యాచ్ లో పొలాండ్ తో సౌదీ అరేబియా.. రాత్రి గం. 9.30లకు జరిగే గ్రూప్ ‘డి’ మ్యాచ్ లో డెన్మార్క్ తో ఫ్రాన్స్.. అర్ధ రాత్రి గం. 12.30లకు జరిగే మ్యాచ్ లో అర్జెంటీనాతో మెక్సికో జట్లు తలపడనున్నాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, FIFA, FIFA World Cup 2022, Football