FIFA World Cup 2022 : ఖతర్ (Qatar) వేదికగా జరుగుతున్న ఫుట్ బాల్ ప్రపంచకప్ (FIFA Football World Cup) 2022లో టాప్ జట్ల హవా కొనసాగుతుంది. గ్రూప్ దశల్లో పసికూనలు సంచలన ప్రదర్శనలు చేస్తే.. నాకౌట్ దశలో మాత్రం టాప్ జట్లు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ (Netherlands), అర్జెంటీనా (Argentina) జట్లు క్వార్టర్స్ కు చేరుకోగా.. తాజాగా మరో రెండు జట్లు ముందడుగు వేశాయి. ఆదివారం జరిగి ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ (France) 3-1 గోల్స్ తేడాతో పొలాండ్ (Poland)పై గెలిచింది. కెయిల్ ఎంబాపే రెండు గోల్స్ (74వ, 90+1వ నిమిషాల్లో) చేశాడు. మరో గోల్ ను జిరోడ్ (44వ నిమిషంలో) సాధించాడు. ఇక పొలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్ ను ఆ జట్టు కెప్టెన్ లెవండోస్కీ (90+9వ నిమిషంలో) పెనాల్టీ రూపంలో సాధించాడు.
ఆట ఆరంభం నుంచే ఫ్రాన్స్ అద్భుత ఆటతీరును కనబరిచింది. పొలాండ్ కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. బంతిని ఎక్కువ సేపు తన ఆధీనంలోనే ఉంచుకున్న ఫ్రాన్స్ 44వ నిమిషంలో తొలి గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో అర్ధ భాగంలో ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపే చెలరేగిపోయాడు. అద్భుత పాస్ లతో పాటు పవర్ ఫుల్ షాట్లతో పొలాండ్ గోల్ కీపర్ కు పని పెట్టాడు. ఈ క్రమంలో రెండు సార్లు పొలాండ్ ఢిపెన్స్ ను ఛేదించి గోల్స్ సాధించాడు. దాంతో ఫ్రాన్స్ విజయం ఖాయం అయ్యింది. ఆఖరి నిమిషాల్లో పొలాండ్ గోల్ చేసినా అది ఫ్రాన్స్ గెలుపును ఆపలేకపోయింది.
The defending champs march on to the Quarter Finals! ????????@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 4, 2022
England move on to the last 8!@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 4, 2022
ఆ తర్వాత జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో యూరో 2020 రన్నరప్ ఇంగ్లండ్ 3-0 గోల్స్ తేడాతో ఆఫ్రికా దేశం సెనెగల్ పై ఘనవిజయం సాధించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఇంగ్లండ్ సెనెగల్ గోల్ పోస్ట్ పై దాడులకు దిగింది. ఈ క్రమంలో హెండర్సన్ (38వ నిమిషంలో), హ్యారీ కేన్ (45+3వ నిమిషంలో), సకా (57వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. దాంతో ఇంగ్లండ్ దర్జాగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్ పోరులో ఫ్రాన్స్ తో ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 10వ తేదీన జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, FIFA, FIFA World Cup 2022, France, Poland