FIFA వరల్డ్ కప్ (FIFA World Cup 2022)లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కీలకమైన ప్రి క్వార్టర్ ఫైనల్స్ నేటి నుంచి(డిసెంబర్ 3, శనివారం) ప్రారంభం కానున్నాయి. టోర్నీలో పాల్గొన్న మొత్తం 32 టీమ్స్‌ను 8 గ్రూపులుగా విభజించిన సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజ్ నుంచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌కు మొత్తం 16 టీమ్‌లు అర్హత సాధించాయి. ఇందులో బ్రెజిల్, పోర్చుగల్, డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ మాత్రమే తమ చివరి మ్యాచ్‌లు ఆడటానికి ముందే ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి. మిగిలిన 13 టీమ్‌లు ఎలిమినేషన్ గండాన్ని దాటుకొని వచ్చాయి.
నేడు మొదలు కాబోతున్న నాకౌట్ స్టేజ్(Knockout Stage)లో ప్రతి రోజూ రెండు గేమ్‌లు జరుగుతాయి. రాత్రి 8:30 గంలకు, రాత్రి 12:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 7 వరకు నాకౌట్ మ్యాచ్‌లు కొనసాగుతాయి. నాకౌట్ స్టేజ్ ప్రారంభానికి ముందు.. అర్హత సాధించిన టీమ్స్, షెడ్యూల్ గురించి తెలుసుకుందాం.
* 2022 FIFA వరల్డ్‌కప్ నాకౌట్ స్టేజ్‌లో అడుగుపెట్టిన 16 టీమ్స్ ఇవే..
గ్రూప్ ఏ నుంచి నాకౌట్ స్టేజ్‌కు నెదర్లాండ్స్ ఏడు పాయింట్లు, సెనెగల్ ఆరు పాయింట్లతో అర్హత సాధించాయి. అదే విధంగా గ్రూబ్ బీ నుంచి ఏడు పాయింట్లతో ఇంగ్లండ్, ఐదు పాయింట్లతో యూఎస్ఏ అర్హత సాధించాయి. గ్రూప్ సీ నుంచి 6 పాయింట్లతో అర్జెంటీనా, 4 పాయింట్లతో పోలాండ్ టీమ్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాయి. గ్రూప్ డీలో 6 పాయింట్లు సాధించిన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా అర్హత పొందాయి.
అదే విధంగా గ్రూప్ ఈ లో ఆరు పాయింట్లు సాధించిన జపాన్, నాలుగు పాయింట్లు గెలుచుకున్న స్పెయిన్ కూడా నాకౌట్ స్టేజ్‌లో ప్రవేశించాయి. గ్రూప్ ఎఫ్ నుంచి ఏడు పాయింట్లతో మొరాకో, ఐదు పాయింట్లతో క్రొయేషియా ఎలిమినేషన్ గండాన్ని దాటాయి. గ్రూప్ జీ నుంచి చెరో ఆరు పాయింట్లతో బ్రెజిల్, స్విట్జర్లాండ్ ప్రి క్వార్టర్స్‌కు చేరాయి. గ్రూప్ హెచ్ నుంచి 6 పాయింట్లతో పోర్చుగల్, 4 పాయింట్లతో దక్షిణ కొరియా నాకౌట్ స్టేజ్‌లో చేరాయి.
* 2022 FIFA వరల్డ్ నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌ల షెడ్యూల్
తేది | మ్యాచ్ | స్టేడియం | సమయం | |
1 | డిసెంబర్ 3 | నెదర్లాండ్స్ vs USA | ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ రయాన్ | రాత్రి 8:30 |
2 | డిసెంబర్ 4 | అర్జెంటీనా vs ఆస్ట్రేలియా | అహ్మద్ బిన్ అలీ స్టేడియం, అల్ రయాన్ | రాత్రి 12:30 |
3 | డిసెంబర్ 4 | ఫ్రాన్స్ vs పోలాండ్ | అల్ తుమామా స్టేడియం | రాత్రి 8:30 |
4 | డిసెంబర్ 5 | ఇంగ్లాండ్ vs సెనెగల్ | అల్ బైట్ స్టేడియం, అల్ ఖోర్ | రాత్రి 12:30 |
5 | డిసెంబర్ 5 | జపాన్ vs క్రొయేషియా | అల్ జనోబ్ స్టేడియం, అల్ వక్రా | రాత్రి 8:30 |
6 | డిసెంబర్ 6 | బ్రెజిల్ vs దక్షిణ కొరియా | స్టేడియం 974, దోహా | రాత్రి 12:30 |
7 | డిసెంబర్ 6 | మొరాకో vs స్పెయిన్ | స్టేడియం 974, దోహా | రాత్రి 8:30 |
8 | డిసెంబర్ 7 | పోర్చుగల్ vs స్విట్జర్లాండ్ | లుసైల్ ఐకానిక్ స్టేడియం, లుసైల్ | రాత్రి 12:30 |
(గమనిక : మ్యాచ్ సమయం భారత కాలమానం ప్రకారం)
ఎక్కడ చూడవచ్చంటే :
నాకౌట్ ఆఫ్ ప్రత్యక్ష ప్రసారాలను స్పోర్ట్ 18 ఛానెల్ లోను వీక్షించవచ్చు. ఇక, జియో సినిమా యాప్ లో కూడా ఈ మ్యాచులు తిలకించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cristiano Ronaldo, FIFA, FIFA World Cup 2022, Foot ball, Lionel Messi