FIFA World Cup 2022 : ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022) 2022లో ఆసియా జట్ల పోరు ముగిసింది. గ్రూప్ దశను దాటి ప్రిక్వార్టర్స్ కు చేరిన జపాన్ (Japan), దక్షిణ కొరియా (South Korea) జట్ల కథ రౌండ్ ఆఫ్ 16లో ముగిసింది. సోమవారం జరిగిన ప్రిక్వార్ట్స్ పోరుల్లో జపాన్ పై క్రొయేషియా.. దక్షిణ కొరియాపై బ్రెజిల్ విజయాలు సాధించాయి. దాంతో క్రొయేషియా, బ్రెజిల్ లు క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాయి. సోమవారం జరిగిన తొలి ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్ లో జపాన్ పై నెగ్గింది. షూటౌట్ లో క్రొయేషియా 3-1 తేడాతో జపాన్ పై నెగ్గింది.
ఈ మ్యాచ్ లో ఇరు జట్లు కూడా నిర్ణీత సమయంలో 1-1తో సమంగా నిలిచాయి. జాపాన్ తరఫున మెడా 43వ నిమిషంలో గోల్ సాధించి ఆధిక్యాన్ని ఇచ్చాడు. అయితే రెండో అర్ధ భాగంలో పెరిసిచ్ 55వ నిమిషంలో గోల్ చేసి స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత ఇరు జట్లు కూడా గోల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. 90 నిమిషాల ఆట 1-1 గోల్స్ తో ముగిసింది. ఈ తర్వాత 30 నిమిషాల పాటు ఎక్స్ ట్రా టైమ్ ఆట సాగింది. ఇందులోనూ ఇరు జట్లు గోల్ సాధించడంలో విఫలం అయ్యాయి. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఈ ప్రపంచకప్ లో ఇదే తొలి పెనాల్టీ షూటౌట్ కావడం విశేషం. ఇందులో జపాన్ తన తొలి రెండు షాట్లను గోల్స్ చేయడంలో విఫలం అయ్యాయి. అదే సమంయలో క్రొయేషియా తొలి రెండు షాట్లను గోల్స్ చేశాయి. మూడో షాట్ ను జపాన్ గోల్ చేయగా.. క్రొయేషియా మిస్ చేసింది. ఇక నాలుగో షాట్ ను జపాన్ కెప్టెన్ మిస్ చేశాడు. క్రొయేషియా నాలుగో షాట్ ను గోల్ వేసి విజేతగా నిలిచింది. జపాన్ తీసుకున్న నాలుగు పెనాల్టీ షాటలలో మూడింటిని క్రొయేషిగా గోల్ కీపర్ సేవ్ చేశాడు.
Croatia go through to the Quarter-finals on penalties! ????????@adidasfootball | #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022
Brazil take a four-goal lead into the break ????#FIFAWorldCup | #Qatar2022
— FIFA World Cup (@FIFAWorldCup) December 5, 2022
భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బ్రెజిల్ అదరగొట్టింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో సౌత్ కొరియాపై గ్రాండ్ విక్టరీని సాధించింది. బ్రెజిల్ తరఫున జూనియర్ (7వ నిమిషంలో), నేమార్ (13వ నిమిషంలో), రిచార్లిసన్ (29వ నిమిషంలో), లుకాస్ (36వ నిమిషంలో) తలా ఒక గోల్ సాధించారు. దక్షిణ కొరియా తరఫున పైక్ (76వ నిమిషంలో) ఒక గోల్ వేశాడు. డిసెంబర్ 9న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్ ఆడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, FIFA, FIFA World Cup 2022, Japan, South korea